లిక్కర్ మాఫియా కాల్పులు.. కానిస్టేబుల్ మృతి

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని కాస్‌గంజ్‌లో మద్యం మాఫియా రెచ్చిపోయింది. మంగళవారం అక్రమ మద్యం వ్యాపారాన్ని అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులపై లిక్కర్ మాఫియా కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో కానిస్టేబుల్ దేవేంద్ర మృతి చెందగా.. ఎస్ఐ అశోక్‌కుమార్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిలో పోలీసులపై కాల్పులు జరిపిన నిందితుడిని పోలీసులు హతమార్చారు. మరో నిందితుడు పరారీలో ఉన్నారు. ఈ లిక్కర్ మాఫియా కాల్పుల ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ […]

Update: 2021-02-09 21:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని కాస్‌గంజ్‌లో మద్యం మాఫియా రెచ్చిపోయింది. మంగళవారం అక్రమ మద్యం వ్యాపారాన్ని అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులపై లిక్కర్ మాఫియా కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో కానిస్టేబుల్ దేవేంద్ర మృతి చెందగా.. ఎస్ఐ అశోక్‌కుమార్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిలో పోలీసులపై కాల్పులు జరిపిన నిందితుడిని పోలీసులు హతమార్చారు. మరో నిందితుడు పరారీలో ఉన్నారు.

ఈ లిక్కర్ మాఫియా కాల్పుల ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డ ఎస్ఐ అశోక్ కుమార్‌కు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. కాల్పుల్లో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. లిక్కర్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Tags:    

Similar News