ఏపీలో మే 4 నుంచి మద్యం అమ్మకాలు

అమరావతి: లాక్‌డౌన్ నిబంధనల సడలింపులతో మే 4 నుంచి ఏపీలో మద్యం అమ్మకాలను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం విక్రయాలకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం నేడు అధికారికంగా ఉత్తర్వులు వెల్లడించే అవకాశం ఉంది. మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం పాటిస్తూ అమ్మకాలు జరిగేలా ఏర్పాట్లు చేయనున్నారు. అయితే బార్లకు మాత్రం అనుమతి ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. జోన్ల విషయంలో జిల్లాను యూనిట్‌గా తీసుకుంటారా లేక మండలాలను యూనిట్‌గా […]

Update: 2020-05-01 20:33 GMT

అమరావతి: లాక్‌డౌన్ నిబంధనల సడలింపులతో మే 4 నుంచి ఏపీలో మద్యం అమ్మకాలను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం విక్రయాలకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం నేడు అధికారికంగా ఉత్తర్వులు వెల్లడించే అవకాశం ఉంది. మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం పాటిస్తూ అమ్మకాలు జరిగేలా ఏర్పాట్లు చేయనున్నారు. అయితే బార్లకు మాత్రం అనుమతి ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. జోన్ల విషయంలో జిల్లాను యూనిట్‌గా తీసుకుంటారా లేక మండలాలను యూనిట్‌గా తీసుకుంటారో తెలియాల్సి ఉంది. జిల్లాను యూనిట్‌గా తీసుకుంటే ఏపీలో ఐదు జిల్లాలు రెడ్ జోన్‌లో ఉన్నాయి. వీటిలో మద్యం అమ్మకాలు జరిగే అవకాశం ఉండదు. ఒక వేళ మండలాలను యూనిట్‌గా తీసుకుంటే రెడ్ జోన్ మండలాలు మినహా మిగతా ప్రాంతాల్లో మద్యం విక్రయాలు జరిగే అవకాశం ఉంది.

Tags: liquor, sales, ap, may 4th, green zones, orange zones

Tags:    

Similar News