మద్యంపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు..

దిశ, ఏపీ బ్యూరో ఏపీలో మద్యపాన నిషేధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకుంటున్న వారిని పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకునే వెసులుబాటు కల్పిస్తూ బుధవారం తీర్పునిచ్చింది. జీవో నెంబర్ 411 ప్రకారం మద్యాన్ని తీసుకొచ్చుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ, రాష్ట్ర పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ హైకోర్టులో కొందరు పిటిషన్ దాఖలు చేశారు. […]

Update: 2020-09-02 02:45 GMT

దిశ, ఏపీ బ్యూరో

ఏపీలో మద్యపాన నిషేధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకుంటున్న వారిని పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకునే వెసులుబాటు కల్పిస్తూ బుధవారం తీర్పునిచ్చింది. జీవో నెంబర్ 411 ప్రకారం మద్యాన్ని తీసుకొచ్చుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ, రాష్ట్ర పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ హైకోర్టులో కొందరు పిటిషన్ దాఖలు చేశారు.

దీనిని విచారించిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. దీంతో ఎవరైనా ఇతర రాష్ట్రాల నుంచి 3 మద్యం బాటిళ్లు తెచ్చుకోవచ్చని హైకోర్టు పేర్కొంది. న్యాయస్థానం తీర్పుపై మద్యం బాబులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News