మేము తోడుకున్న గుంతలో మేమే పడ్డాం సారూ…
దిశ, దుబ్బాక : మీరు ఎంత చెప్పినా వినకపోతిమి.. ఓటు వెయ్యొద్దు అంటే.. వేస్తిమి.. నేడు బీజేపీ వాళ్ళు యాసంగి వడ్లు వేయొద్దు అంటుర్రు.. మేము తోడుకున్న గుంతలో మేమే పడ్డాం సారూ.. అని రాష్ట్ర వైద్యా ఆరోగ్య, ఆర్ధిక శాఖా మంత్రి తన్నీరు హరీష్ రావుతో లింగాపూర్ మహిళలు మొర పెట్టుకున్నారు. లింగాపూర్‌లో దివంగత జడ్పీటీసీ గాంధారి ఇంద్రసేన రెడ్డి దశదిన ఖర్మ కార్యక్రమానికి మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి […]
దిశ, దుబ్బాక : మీరు ఎంత చెప్పినా వినకపోతిమి.. ఓటు వెయ్యొద్దు అంటే.. వేస్తిమి.. నేడు బీజేపీ వాళ్ళు యాసంగి వడ్లు వేయొద్దు అంటుర్రు.. మేము తోడుకున్న గుంతలో మేమే పడ్డాం సారూ.. అని రాష్ట్ర వైద్యా ఆరోగ్య, ఆర్ధిక శాఖా మంత్రి తన్నీరు హరీష్ రావుతో లింగాపూర్ మహిళలు మొర పెట్టుకున్నారు. లింగాపూర్‌లో దివంగత జడ్పీటీసీ గాంధారి ఇంద్రసేన రెడ్డి దశదిన ఖర్మ కార్యక్రమానికి మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి హరీశ్ రావు హాజరై తిరిగి వెళ్తుండగా లింగాపూర్‌లో మహిళా రైతులతో మాట్లాడారు.
ఏమమ్మా అంతా బాగున్నారా? అని మంత్రి ప్రశ్నించగా ఏం బాగా సారు.. అంతా ఆగంలో ఉన్నాం. యాసంగి వరి వద్దు అంటున్నారని వారు పేర్కొనగా నేను ఎంత చెప్పినా విన్నరా.. వద్దు వద్దు అన్నా బీజేపీ వాళ్లకు ఓట్లు వేస్తిరి అని మంత్రి అనగానే ఎం చేస్తాం సారూ నిజమే మీరు చెప్పినా వినలేదు. మేము తీసుకున్న గుంతలో మేము పడ్డాం సారూ అని ఆవేదన వ్యక్తం చేశారు. యాసంగిలో వరి సాగు కోసం బీజేపీ వాళ్ళతో కొట్లాడుదాం. అని వాళ్ళకు ధైర్యం చెప్పి మంత్రి వెళ్లిపోయారు.