లింగంపల్లి మార్కెట్ కూల్చివేత

దిశ, తెలంగాణ బ్యూరో: నారాయణగూడ ఫ్లై ఓవర్ కింద ఉన్న పురాతన లింగంపల్లి మార్కెట్‌ను జీహెచ్ఎంసీ అధికారులు శనివారం కూల్చివేశారు. మార్కెట్ శిథిలావస్థకు చేరడంతో కూల్చివేసినట్టు, దాని స్థానంలో కొత్త మార్కెట్ నిర్మిస్తామని బల్దియా అధికారులు తెలిపారు. అయితే తాము జీవనోపాధి కోల్పోతున్నామని, ప్రత్యామ్నాయం చూపించాలని స్థానిక దుకాణదారులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర ఓబీసీ ప్రచార కార్యదర్శి కేశబోయిన శ్రీధర్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. వ్యాపారులకు ప్రత్యమ్నాయం చూపించాలని జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడారు. […]

Update: 2020-10-03 02:45 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: నారాయణగూడ ఫ్లై ఓవర్ కింద ఉన్న పురాతన లింగంపల్లి మార్కెట్‌ను జీహెచ్ఎంసీ అధికారులు శనివారం కూల్చివేశారు. మార్కెట్ శిథిలావస్థకు చేరడంతో కూల్చివేసినట్టు, దాని స్థానంలో కొత్త మార్కెట్ నిర్మిస్తామని బల్దియా అధికారులు తెలిపారు. అయితే తాము జీవనోపాధి కోల్పోతున్నామని, ప్రత్యామ్నాయం చూపించాలని స్థానిక దుకాణదారులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర ఓబీసీ ప్రచార కార్యదర్శి కేశబోయిన శ్రీధర్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. వ్యాపారులకు ప్రత్యమ్నాయం చూపించాలని జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడారు. అబిడ్స్ ఏసీపీ, భిక్షంరెడ్డి, నారాయణగూడ సీఐ రమేష్ కుమార్ భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Tags:    

Similar News