ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు లైన్ క్లీయర్

దిశ, తెలంగాణ బ్యూరో: ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు లైన్ క్లియర్ అయింది. వేరుశనగ ఆధారిత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ఆర్థిక సహకారాలు అందిస్తామని కెనరాబ్యాంక్ ప్రతినిధులు తెలిపారు. మంగళవారం మంత్రుల నివాస సముదాయంలో కెనరా బ్యాంక్ జీఎం కేహెచ్ పట్నాయక్ మంత్రి నిరంజన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్ట్ రిపోర్ట్ ను అందిస్తే ఎన్ని యూనిట్లకైనా ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. ఆర్థిక సహకారానికి ముందుకు వచ్చినందుకు కెనరా బ్యాంక్ ప్రతినిధులుకు మంత్రి నిరంజన్ […]

Update: 2021-08-03 09:18 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు లైన్ క్లియర్ అయింది. వేరుశనగ ఆధారిత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ఆర్థిక సహకారాలు అందిస్తామని కెనరాబ్యాంక్ ప్రతినిధులు తెలిపారు. మంగళవారం మంత్రుల నివాస సముదాయంలో కెనరా బ్యాంక్ జీఎం కేహెచ్ పట్నాయక్ మంత్రి నిరంజన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్ట్ రిపోర్ట్ ను అందిస్తే ఎన్ని యూనిట్లకైనా ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. ఆర్థిక సహకారానికి ముందుకు వచ్చినందుకు కెనరా బ్యాంక్ ప్రతినిధులుకు మంత్రి నిరంజన్ రెడ్డి కృతజ్ణతలు తెలిపారు. రైతులు వేరుశనగను సాగు చేసేలా ప్రోత్సహిస్తామన్నారు.

Tags:    

Similar News