అగ్గితో చెలగాటం ఆడటం అంటే ఇదే.. అగ్ని పర్వతం దగ్గర ఫొటోలకు పోజులు ఇచ్చిన మహిళ.. ఒక్క క్షణంలో పరిస్థితి తారుమారు..
ఫోన్ లో సెల్ఫీ తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం కామన్ అయిపోయింది. తాము ఎక్కడికి వెళ్తున్నాం? ఎంత ఎంజాయ్ చేస్తున్నాం? అని
దిశ, ఫీచర్స్: ఫోన్ లో సెల్ఫీ తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం కామన్ అయిపోయింది. తాము ఎక్కడికి వెళ్తున్నాం? ఎంత ఎంజాయ్ చేస్తున్నాం? అని చెప్పుకునేందుకు.. తమ స్టేటస్ ను పది మందికి తెలిపేందుకు ఇలా చేస్తుంటారు. అయితే ఈ సెల్ఫీ పిచ్చి ఓ మహిళ అగ్ని పర్వతం లోపల పడిపోయి చనిపోయే స్థితికి తీసుకువచ్చింది.
వోల్కనోకు సంబంధించిన ప్రకృతి దృశ్యాలను చూసేందుకు భర్తతో కలిసి ఇండోనేషియాలోని అగ్నిపర్వత పర్యాటక పార్క్ ఇజెన్ ను సందర్శించేందుకు వెళ్లింది చైనాకు చెందిన హువాంగ్. అయితే టూరిస్ట్ గైడ్ ఎంత చెప్పినా వినకుండా సూర్యోదయంతో పాటు 'బ్లూ ఫైర్' లేదా 'బ్లూ లావా' ను ఫొటో తీసుకునేందుకు కొండ అంచుకు ఎక్కినట్లు తెలుస్తుంది. అయితే లావా ఎగిసిపడుతూ ఉండగా.. అద్భుతమైన బ్యాక్ డ్రాప్ లో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించింది. అయితే తాను పట్టుకున్న ఎండిపోయిన చెట్టు కొమ్మ విరగడంతో అందులోనే పడి చనిపోయింది. భర్త చూస్తుండగానే ఇదంతా జరగ్గా.. ఏమీ చేయలేని దుస్థితిలో కన్నీరుమున్నీరు అవుతున్నాడు. దాదాపు రెండు గంటల రెస్క్యూ తర్వాత ఆమె డెడ్ బాడీని తీసిన అధికారులు భర్తకు అప్పగించారు.
ఈ విషాదం ఇండోనేషియాలో అధిక అగ్నిపర్వత కార్యకలాపాల నేపథ్యంలో జరగ్గా.. రువాంగ్ పర్వతం అనేకసార్లు విస్ఫోటనం చెందింది. సామ్ రతులంగి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేసిందుకు కారణమైంది. విస్ఫోటనాలు లావా, బూడిద, మెరుపులతో కూడి ఉండగా.. చుట్టు పక్కల ప్రాంతాల నుంచి వేలాది మందిని తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పసిఫిక్ "రింగ్ ఆఫ్ ఫైర్" వెంబడి ఉన్న ఇండోనేషియా భూకంప, అగ్నిపర్వత అవాంతరాలకు కొత్తేమీ కాదు. గత సంవత్సరం సుమత్రాలోని మరాపి పర్వతంపై విస్ఫోటనం 22 మంది ప్రాణాలు కోల్పోయెందుకు కారణమైంది.