మరో రెండేళ్లలో ఇనుముతో నిండిపోనున్న పసిఫిక్ మహాసముద్రం.. శాస్త్రవేత్తల ఆందోళన...
వాతావరణ మార్పులను పరిష్కరించడానికి శాస్త్రవేత్తలు సరికొత్త, వినూత్న ప్రణాళికతో ముందుకు వచ్చారు, భారీ పసిఫిక్ మహసముద్రాన్ని ఇనుముతో నింపేందుకు నిర్ణయించారు. ఈ టెక్నాలజీని ఓషన్ ఐరన్ ఫెర్టిలైజేషన్ (OIF) అని పిలుస్తుంటారు. ఇందులో భాగంగా సముద్రపు మొక్క 'ఫైటోప్లాంక్టన్' పెరుగుదలను
దిశ, ఫీచర్స్ : వాతావరణ మార్పులను పరిష్కరించడానికి శాస్త్రవేత్తలు సరికొత్త, వినూత్న ప్రణాళికతో ముందుకు వచ్చారు, భారీ పసిఫిక్ మహసముద్రాన్ని ఇనుముతో నింపేందుకు నిర్ణయించారు. ఈ టెక్నాలజీని ఓషన్ ఐరన్ ఫెర్టిలైజేషన్ (OIF) అని పిలుస్తుంటారు. ఇందులో భాగంగా సముద్రపు మొక్క 'ఫైటోప్లాంక్టన్' పెరుగుదలను ప్రేరేపించడానికి సముద్ర ఉపరితలంపై ఇనుమును పొడి రూపంలో నింపుతారు. కార్బన్ డయాక్సైడ్‌ని గ్రహించి సముద్రంలో బంధించడమే ఈ మెరైన్ ప్లాంట్ పెరుగుదలకు కారణం. కాగా ప్రతి సంవత్సరం రెండు మిలియన్ టన్నుల ఇనుమును సముద్రంలోకి విడుదల చేస్తే 2100 నాటికి దాదాపు 50 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్‌ను వాతావరణం నుంచి తొలగిస్తుందని అంచనా.
పరిశోధకుల ప్రణాళిక ప్రకారం 2026 నాటికి 3,800 చదరపు మైళ్ల ఈశాన్య పసిఫిక్‌లో ఇనుము విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఎక్స్‌ప్లోరింగ్ ఓషన్ ఐరన్ సొల్యూషన్స్ (ExOIS) శాస్త్రవేత్తలు పోషకాలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఐరన్ సల్ఫేట్‌ను రిలీజ్ చేసే ఆలోచన చేస్తున్నారు. ఉత్తర, దక్షిణ అమెరికా పశ్చిమ తీరం నుంచి ఆసియా తూర్పు తీరం వరకు... పైకి ఆర్కిటిక్ వరకు విస్తరించి ఉన్న ఈశాన్య పసిఫిక్ మహాసముద్రంలో కొరత ఎక్కువగా ఉండగా.. ఈ ప్రాంతాల్లో ఇనుము పంపిణీ ఫైటోప్లాంక్టన్ పెరుగుదలను పెంచుతుందనే ఆలోచనలో ఉన్నారు. తద్వారా రాబోయే సంవత్సరాల్లో వాతావరణం నుంచి కార్బన్ డయాక్సైడ్ తగ్గించాలని చూస్తున్నారు. కాగా సముద్రంలో ఐరన్ సల్ఫేట్ రిలీజ్ చేయడం వల్ల గ్లోబల్ వార్మింగ్ తగ్గించడంలో సహాయపడుతుందని పరిశోధకులు వివరిస్తున్నారు.
అయితే ఐరన్ సముద్ర జీవులకు అవసరమైన పోషకాల క్షీణతకు దారితీస్తుందని.. సముద్రంలోని కొన్ని ఫుడ్ సైకిల్స్ ను చంపేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పద్ధతి డెడ్ జోన్లను సృష్టించగలదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆల్గల్ బ్లూమ్స్ పెరగడానికి వీలు కల్పిస్తుందని.. నీటిలోని ఆక్సిజన్ మొత్తాన్ని పీల్చుకుని, ఇతర జీవులను చంపుతుందని చెప్తున్నారు.
Read More...
Another Earth : అక్కడ మనుషులు వంద కాదు.. ఏకంగా 2000 సంవత్సరాలు జీవిస్తారు!