CREATIVE IDEAS : స్నానం చేస్తున్నప్పుడే క్రియేటివ్ ఐడియాస్ ఎక్కువ వస్తుంటాయి? ఎందుకంటే...

సాధారణంగా స్నానం చేసేటప్పుడు క్రియేటివ్ ఐడియాస్ ఎక్కువ వస్తుంటాయి. చాలా మంది ఈ విషయాన్ని గుర్తించి ఉంటారు కానీ ఎందుకు ఇలా జరుగుతుందనేది మాత్రం తెలియదు.

Update: 2024-08-30 14:13 GMT

దిశ, ఫీచర్స్ : సాధారణంగా స్నానం చేసేటప్పుడు క్రియేటివ్ ఐడియాస్ ఎక్కువ వస్తుంటాయి. చాలా మంది ఈ విషయాన్ని గుర్తించి ఉంటారు కానీ ఎందుకు ఇలా జరుగుతుందనేది మాత్రం తెలియదు. అయితే ప్రముఖ న్యూరో సైంటిస్టులలో ఒకరైన ఆలిస్ ఫ్లాహెర్టీ దీనికి సమాధానం ఇచ్చారు. సృజనాత్మకతకు ముఖ్యకారణం డోపమైన్. ఎంత ఎక్కువ డోపమైన్ విడుదల చేయబడితే.. అంత ఎక్కువ సృజనాత్మకంగా ఉంటారని తెలిపారు. వేడి నీటితో స్నానం చేసేటప్పుడు.. వ్యాయామం, డ్రైవింగ్ మొదలైన సందర్భాల్లో బ్రెయిన్ రిలాక్సింగ్ గా ఉంటుంది. అప్పుడే గొప్ప ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుందని వివరించారు.

మరో కీలకమైన అంశం పరధ్యానం. పరధ్యానం కూడా సృజనాత్మక ఆలోచనలకు కారణమవుతుందని తేలింది. ఒక సమస్య గురించి రోజంతా ఆలోచించినా పరిష్కారం దొరకదు. కానీ స్నానం చేస్తున్నప్పుడు మాత్రం అద్భుతమైన ఐడియా వచ్చేస్తుంది. దీన్ని ఇంక్యుబేషన్ పీరియడ్‌గా పిలుస్తున్నారు శాస్త్రవేత్తలు. ఉపచేతన మనస్సు మీరు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి చాలా కష్టపడుతుంది. మీరు పరధ్యానంలో ఉండగానే ఇలాంటి గొప్ప ఆలోచనలను సృష్టిస్తుంది. మొత్తానికి మీరు డోపమైన్ ప్రవాహాన్ని స్వీకరించిన తర్వాత.. స్నానం చేయడం, వంట చేయడం వంటి అత్యంత అలవాటైన పని ద్వారా సులభంగా పరధ్యానం చెందవచ్చు. కాగా సృజనాత్మకంగా ఉండటానికి ప్రశాంతమైన మానసిక స్థితి చాలా ముఖ్యం అని జోనా లెహ్రే చెప్పారు.

Tags:    

Similar News