సీమంతం రోజున గర్భవతికి గాజులు ఎందుకేస్తారు.. దీని వెనకున్న సైంటిఫిక్ రీజన్ ఇదే?

సీమంతం రోజున మహిళలకు గాజులు వేసే సంప్రదాయం తరతరాలుగా వస్తోన్న ఆనవాయితీ.

Update: 2024-09-22 14:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: సీమంతం రోజున మహిళలకు గాజులు వేసే సంప్రదాయం తరతరాలుగా వస్తోన్న ఆనవాయితీ. అలాగే ఆడవాళ్లు పెళ్లిళ్లలో నిశ్చితార్థం వేడుకలో, పూజలలో పాల్గొన్నప్పుడు ఆడవాళ్లు చేతినిండా గాజులు వేసుకుని కనిపిస్తారు. పండుగలకైతే మహిళలు పట్టుచీరలు కట్టుకుని, జడలో పువ్వులు, చేతినిండా గాజులతో ఎక్కువగా కనిపిస్తుంటారు.

ఇలా ప్రతి వేడుకలో మహిళలు గాజులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అయితే చాలా మంది గాజులు వేసుకోవడం అలంకరణగా భావిస్తారు. అందంగా కనిపించడం కోసం వేసుకుంటున్నామని అనుకుంటారు. కానీ దీని వెనక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. సీమంతం రోజునే కాకుండా ఇలా ప్రతి కార్యక్రమానికి మహిళలు చేతులకు గాజులు వేసుకోవడానికి.. దీని వెనకున్నరహస్యమేంటో ఇప్పుడు చూద్దాం..

అయితే చేతి మణికట్టు వద్ద గర్భాశయానికి సంబంధించిన నాడులు ఉంటాయి. కాగా ఈ నాడులపై గాజుల ఒత్తిడి పడుతుంది. దీంతో ప్రెగ్నెన్సీ మహిళలు సుఖ ప్రసవం అవుతారని అంటారు. అలాగే వినసొంపుగా ఉంటుంది. గాజుల సౌండ్‌కు కడుపులో ఉన్న బేబీ మెదడులోని కణజాలం వృద్ధి చెందుతుంది. ఈ శబ్దం వల్ల ప్రెగ్నెన్సీ మహిళలకు స్ట్రెస్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

చేతికున్న గాజులు చూసుకున్నప్పుడల్లా మురిసిపోతుంటారు. గర్భవతులు ఒత్తిడితో డెలివరీ అయితే పుట్టిన బేబీ వెయిట్ చాలా తక్కువగా ఉంటుందని గైనకాలజిస్టులు చెబుతారు. కాగా గాజుల వల్ల ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. అలాగే నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. బీపీలు, గుండె సమస్యలు రావు. గాజులు వేసుకోవడం వల్ల మహిళలు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Read More...

Homemade Face Mask: ఇలా చేస్తే 5 నిమిషాల్లోనే అదిరిపోయే అందం మీ సొంతం ! 


Similar News