దోమలు మనుషుల తల చుట్టే ఎందుకు తిరుగుతాయి?.. కారణం ఇదే..
ర్షా కాలం వచ్చిందంటే దోమల బెడద కూడా పెరుగుతుంది. ఇవి కుట్టడంవల్ల డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపిస్తాయి. అందుకే దోమ తెరలు వాడాలని, ఇతర నివారణ పద్ధలు పాటించాలని చెప్తుంటారు.
దిశ, ఫీచర్స్ : వర్షా కాలం వచ్చిందంటే దోమల బెడద కూడా పెరుగుతుంది. ఇవి కుట్టడంవల్ల డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపిస్తాయి. అందుకే దోమ తెరలు వాడాలని, ఇతర నివారణ పద్ధలు పాటించాలని చెప్తుంటారు. అయితే రాత్రిళ్లు మాత్రమే దోమలు ఎక్కువగా కుడుతుంటాయి. పైగా ఇవి మనుషులను సమీపించినప్పుడు ఇతర భాగాలకంటే తల చుట్టూనే ఎక్కువగా తిరుగుతుండటాన్ని మీరెప్పుడైనా గమనించారా?.. ఇందుకు వేరే కారణం ఉందంటున్నారు నిపుణులు. అదేంటో చూద్దాం.
నిపుణుల ప్రకారం.. రాత్రిపూట మానవ శరీరం నుంచి, తలపై చర్మం నుంచి వెలువడే వాసనలు, ఇతర రసాయనాలు, అలాగే శ్వాస తీసుకుంటున్నప్పుడు ముక్కు ద్వారా బయటకు వదిలే కార్బన్ డయాక్సైడ్ సహజంగానే దోమలను ఆకర్షిస్తాయట. ఈ కారణంగా దోమలు మనిషి తలచుట్టే ఎక్కువగా తిరుగుతుంటాయి. అంతేకాకుండా మన చర్మం 340కి పైగా రసాయన పదార్థాలను ప్రొడ్యూస్ చేస్తుంది. వీటిలో కొన్నింటి వాసన దోమలకు ఆహారంగా ఉపయోగపడుతుంది. అలాగే చెమటలో ఉండే కొన్ని రసాయనాలు కూడా దోమలను ఆకర్షిస్తాయి. రాత్రిళ్లు తలభాగంలో చెమట రావడం, త్వరగా ఆరకపోవడం వల్ల దోమలు అక్కడే ఎక్కువగా తిరుగుతుంటాయి. శరీర భాగంపై దుప్పటి కప్పుకొని ఉండటం, తలభాగంపై కప్పుకోకపోవడం కూడా మరో కారణం.