మలేరియాకు కొత్త వ్యాక్సిన్.. ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందన్న డబ్ల్యుహెచ్ఓ
ప్రపంచవ్యాప్తంగా మరణానికి దారితీసే ప్రాణాంతక వ్యాధుల్లో మలేరియా ఒకటి.
దిశ, ఫీచర్స్: ప్రపంచవ్యాప్తంగా మరణానికి దారితీసే ప్రాణాంతక వ్యాధుల్లో మలేరియా ఒకటి. దోమకాటుతో వ్యాపించే మలేరియా కేసులు 2021లో వరల్డ్ వైడ్‌గా 247 మిలియన్లు నమోదయ్యాయి. ఆఫ్రికన్ కంట్రీస్‌లో 96శాతం మరణాలు సంభవించగా.. చనిపోయిన వారిలో 80శాతం ఐదేళ్లలోపు పిల్లలే ఉన్నారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఏటా దాదాపు లక్షన్నరమంది చిన్నారులు ఈ వ్యాధివల్లే చనిపోతున్నారు.
ఇండియాలోనూ దీని ప్రభావం ఎక్కువే. ఇటువంటి పరిస్థితుల్లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు డెవలప్ చేసిన R21/మ్యాట్రిక్స్-M వ్యాక్సిన్ పట్ల ఆసక్తి నెలకొంది. ఇది పిల్లల్లో మలేరియాను నివారించడంలో సురక్షితమైందని, ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని పేర్కొన్న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దానిని అనుమతించడంతోపాటు రెకమండ్ కూడా చేసింది. న్యూ R21 వ్యాక్సిన్ 3-డోస్ సిరీస్ తర్వాత ఒక సంవత్సర కాలంలో మలేరియా సింప్టమేటిక్ కేసులను 75 శాతం తగ్గించినట్లు, ఆ తర్వాత ఇచ్చిన నాల్గవ డోస్ కూడా అధిక సామర్థ్యాన్ని కనబర్చినట్లు డబ్ల్యుహెచ్ఓ తెలిపింది.