Viral video : చూస్తుండగానే ఆకాశంలో అద్భుత దృశ్యం .. అంతలోనే మరో విచిత్రం!

ప్రకృతిలో అప్పుడప్పుడూ జరిగే కొన్ని సంఘటనలు అద్భుతంగా అనిపిస్తుంటాయి. ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి.

Update: 2024-08-30 06:56 GMT

దిశ, ఫీచర్స్: ప్రకృతిలో అప్పుడప్పుడూ జరిగే కొన్ని సంఘటనలు అద్భుతంగా అనిపిస్తుంటాయి. ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. కొన్నిసార్లు ఆకాశంలో చోటు చేసుకునే వింతలు.. విచిత్రాలు.. ఆకట్టుకునే దృశ్యాలు క్యూరియాసిటీని పెంచుతాయి. సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అవుతూ జనాన్ని ఆకట్టుకుంటాయి. అసలు అవి ఎలా జరుగుతాయో.. ఎందుకు జరుగుతాయో కూడా కొన్నిసార్లు మిస్టరిగానే మిగిలిపోతూ ఉంటుంది. అటువంటి వీడియో ఒకటి ప్రజెంట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అక్కడేం జరిగిందంటే..

ప్రపంచంలో కొందరు ప్రజలు పవిత్రంగా భావించే మక్కా నగరం అది. కాగా ఇటీవల ఆ ప్రాంతాన్ని ప్రకృతి వైపరీత్యాలు, తుపానులు చుట్టుముట్టాయి. ఉరుములు, మెరుపులు, పిడుగుపాటుతో కూడిన వర్షాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్లు ప్రపంచ వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. కాగా ఇటీవల మక్కాలో రాత్రి సమయంలో గంటకు 80 కి.మీ వేగంతో కూడిన భారీ తుపాను సంభవించింది. అయితే ఆ సందర్భంగా అక్కడ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనదిగా పేర్కొనే ప్రముఖ క్లాక్ టవర్‌పై భాగంలోంచి ఆకాశంలో అద్భుత దృశ్యం చోటుచేసుకుంది. సరిగ్గా ఆ టవర్ కొననుంచి నింగిలోకి గీతలు గీస్తున్నట్లుగా మెరుపులు మెరుస్తూ ఉండగా.. వర్షంతోపాటు పిడుగు కూడా పడింది. కాగా రాత్రిపూట ఈ దృశ్యం చాలా వింతగా, అద్భుతంగా అనిపించింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అందరూ ఆశ్చర్యపోవడంతోపాటు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Video Credits To Visual feat On X Id


Similar News