Viral video: పెళ్లి జరుగుతుండగా వధువు చేసిన పనికి అందరూ షాక్..! ఏం జరిగిందో మీరే చూడండి

పెళ్లి అంటేనే ఓ భావోద్వేగం..ఓ సంతోషం.. చేసుకోబోయే వ్యక్తి జీవితంలో అదో కీలక ఘట్టం. అందుకే ఉన్నంతలో ఆనందంగా జరుపుకోవాలని ప్రతీ ఒక్కరు అనుకుంటారు.

Update: 2024-08-30 06:13 GMT

దిశ, ఫీచర్స్ : పెళ్లి అంటేనే ఓ భావోద్వేగం..ఓ సంతోషం.. చేసుకోబోయే వ్యక్తి జీవితంలో అదో కీలక ఘట్టం. అందుకే ఉన్నంతలో ఆనందంగా జరుపుకోవాలని ప్రతీ ఒక్కరు అనుకుంటారు. ముఖ్యంగా వధువు విషయానికి వస్తే ఓ వైపు ఆనందం, మరోవైపు ఆందోళన కూడా ఉంటుంది. నచ్చిన వ్యక్తిని మ్యారేజ్ చేసుకుంటున్నందుకు హ్యాపీగా ఉన్నా.. పుట్టింటిని వదిలి వెళ్తున్నానన్న బాధ ఆమెను వెంటాడుతుంది. దీంతో పెళ్లి తంతు పూర్తయ్యే వరకు ఓ విధమైన ఆందోళనగా కనిపించడం సహజమే. కానీ ఓ పెళ్లి కూతురులో మాత్రం అలాంటి టెన్షన్ ఏదీ కనిపించగా పోగా.. ఆమె చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోయారు. ప్రజెంట్ ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

అక్కడి వాతావరణం చూస్తుంటే పెళ్లి ఘనంగా జరిపించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. వధూ వరులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎంచక్కా వచ్చి పెళ్లి పీటల మీద కూర్చున్నారు. ఓ వైపు పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఇంకో వైపు పంతులు వేదమంత్రాలు చదువుతున్నాడు. వధూ వరుల కుటుంబ సభ్యులు, వివాహానికి హాజరైన జనమంతా ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఇంతలోనే షాకింగ్ సన్నివేశం చోటుచేసుకుంది. ఏంటంటే.. ఎవరి పనిలో వారు బిజీగా ఉంటే పెళ్లి కూతురు మాత్రం అవేవీ పట్టించుకోకుండా ఎంచక్కా కునుకు తీస్తోంది. ఇది గమనించిన పెళ్లి కొడుకు ఆమెను కదిలించి నిద్రలేపగా ఏమీ ఎరుగనట్టు వెంటనే మేల్కొని చిన్న స్మైల్ ఇచ్చింది. ఇదంతా వీడియోలో రికార్డ్ కాగా.. దానిని సోషల్ మీడియాలో కూడా పోస్టు చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుండగా పెళ్లి కూతురు చేసిన పనికి అందరూ కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. 

Video Credits To Official Viralclip


Similar News