బెల్లం ఏ టైంలో తినాలి..?

నిజానికి బెల్లం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను అర్థం చేసుకుంటే ఏ సమయంలో తీసుకున్న సూపర్ హెల్త్ ను ఇస్తుంది. ఉదయం చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే.. త్వరిత శక్తిని అందించే సుక్రోజ్, గ్లూకోజ్ లభిస్తాయి.

Update: 2024-07-11 07:38 GMT

దిశ, ఫీచర్స్: నిజానికి బెల్లం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను అర్థం చేసుకుంటే ఏ సమయంలో తీసుకున్న సూపర్ హెల్త్ ను ఇస్తుంది. ఉదయం చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే.. త్వరిత శక్తిని అందించే సుక్రోజ్, గ్లూకోజ్ లభిస్తాయి. ఆరోగ్యకరమైన ప్రేగు కదలికలకు సహాయపడుతుంది. మధ్యాహ్నం ఎవర్జీ బూస్ట్ చేసేందుకు డ్రైఫ్రూట్స్ లేదా స్నాక్స్ తో కలిపి తినాలి.

బెల్లం జీర్ణక్రియకు సహాయపడుతుందని కొందరు చెప్పినా.. ఫాలో ఫాలో కావద్దనే చెప్తున్నారు నిపుణులు. హీట్ లక్షణాల కారణంగా సాయంత్రం తినడం మంచిదని అంటుంటారు నిపుణులు. అయితే రోజులో అత్యంత వేడిగా ఉండే సమయంలో ముఖ్యంగా మండు వేసవిలో అస్సలు తీసుకోకూడదు. ఇక రాత్రి పడుకునే ముందు బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే రక్తహీనత, మలబద్ధకం సమస్యలకు పరిష్కారం చూపిస్తుందని చెప్తున్నారు.

నోట్ : నిజానికి మోడరేషన్ కీలకం. రోజూ సమయంతో సంబంధం లేకుండా బెల్లం తినండి. వివిధ సమయాల్లో మీ బాడీని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోండి. అంతిమంగా దీన్ని తినేందుకు సరైన సమయం వ్యక్తిగత ప్రాధాన్యతలు, లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది.


Similar News