ఆ పనులు చేసేటప్పుడు భర్తకు భార్య ఏ వైపు ఉండాలి?

ఎన్నో సంస్కృతులు, ఆచారాలు, సంప్రదాయాలను అనుసరిస్తూ భారతీయుల జీవన విధానం నడుస్తున్నది.

Update: 2023-06-28 12:45 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఎన్నో సంస్కృతులు, ఆచారాలు, సంప్రదాయాలను అనుసరిస్తూ భారతీయుల జీవన విధానం నడుస్తున్నది. ఒక్కో ప్రాంతం ఒక్కో సంప్రదాయాన్ని పాటిస్తున్నది. దీనిలో భాగంగానే భార్యాభర్తల అమరిక కూడా ఆచార వ్యవహారాల్లోకి వచ్చి చేరింది. పూజలు, పెళ్లిలు, వేడుకల్లో భార్య భర్తకు ఎటువైపు ఉండాలి..? ఏ కార్యానికి ఏ వైపు ఉండాలో కూడా కచ్చితమైన స్థానాలను రూపొందించారు పూర్వికులు. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.

భారతదేశ సంప్రదాయం ప్రకారం భర్తకు భార్య ఎప్పుడూ ఎడమవైపున మాత్రమే ఉండాలి. పూజాధికాలు నిర్వహించేటప్పుడు, దానాలు, ధర్మాలు చేసే సమయాన భార్య భర్త ఎడమవైపున ఉండాలి. కన్యాదాన సమయాన, విగ్రహ ప్రతిష్ఠలప్పుడూ కుడివైపున ఉండాలి. బ్రహ్మదేవుడు మగవారికి కుడి భాగం నుంచి, స్త్రీని ఎడమ భాగం నుంచి సృష్టించాడని శాస్త్రాలు చెబుతున్నాయి. శ్రీమహావిష్ణువు తన భార్య శ్రీమహాలక్ష్మిని ఎడమ స్థానంలో పదిలంగా ఉంచుకున్నాడు. శివుని ఎడమ భాగములోనే 'ఈశ్వరి' ఉంటుంది. (అర్ధనారీశ్వరుడు). నిద్రలో కూడా భర్త భార్యపై కుడిచేతిని వేసి రక్షణగా చూసుకుంటాడు. భర్త చేతి స్పర్శతో భార్య అనంతమైన భద్రతను పొంది సుఖంగా నిద్రిస్తుంది.

Read More:   చేతికి కంకణం ఎందుకు కట్టుకుంటారు..? లాభమా.. నష్టమా..?

Tags:    

Similar News