Fomo: సోషల్ మీడియాపై మీ ఆసక్తి.. వ్యాపారంగా ఎలా మారుతోందంటే..
Fomo: సోషల్ మీడియాపై మీ ఆసక్తి.. వ్యాపారంగా ఎలా మారుతోందంటే..
దిశ, ఫీచర్స్ : సోషల్ మీడియా.. ప్రస్తుతం పవర్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ హబ్ అని చెప్పవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యక్తులతో కనెక్ట్ అవ్వడానికి, అభిప్రాయాలను పంచుకోవడానికి సరైన వేదిక కూడాను. ఫేస్ బుక్, ఇన్ స్టా, ఎక్స్, రెడిట్ ఇలా.. ఏదో ఒక సోషల్ మీడియా ఎకౌంట్ లేనివారంటూ ఈ కాలంలో ఎవరూ ఉండటం లేదు. అయితే ప్రజల్లో ఉన్న ఇలాంటి ఆసక్తే ఇతరులకు వ్యాపారంగా మారుతోంది అంటున్నారు నిపుణులు. మనం చేసే లైకులు, షేరింగ్‌లు ఇన్ ఫ్లుయెన్సర్లను ప్రమోట్ చేయడంలో, పరోక్షంగా వారు ఆర్థికంగా బలడటంలో సహాయపడుతున్నాయి. కాగా ప్రస్తుతం మరో నయా ట్రెండ్ ముందుకు వచ్చింది. అదే ‘గెట్ యువర్ ఫ్లెక్స్’ ఇది సోషల్ మీడియాపై ఆసక్తి ఉన్నవారిని ఎలా ఆకట్టుకుంటుందో ఇప్పుడు పరిశీలిద్దాం.
ఏమిటీ ‘గెట్ యువర్ ఫ్లెక్స్’
‘గెట్ యువర్ ఫ్లెక్స్’ ఒక నయా ట్రెండ్. ఇది ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ (FOMO) డ్రైవింగ్ బిహేవియర్ కలిగిన వ్యక్తులకు ప్రత్యేకమైన సేవలు అందించేందుకు ఉద్భవించిన ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్. అంటే సోషల్ మీడియాలో ఏదో ఒక విధంగా కనిపిస్తూ ఫేమస్ వ్యక్తులుగా చలామణి అవ్వాలనే కోరికగల వ్యక్తులకు సర్వీస్ అందిస్తుంది. ఇండ్లల్లోనే ఖాళీగా ఉంటున్నవారు, సమయం లేక సోషల్ మీడియాలో తమ గురించి స్టోరీలను క్రియేట్ చేసి పోస్ట్ చేయలేని వారు చాలామందే ఉంటారు. అలాంటి వారు గెట్ యువర్ ఫ్లెక్స్ ఆన్ లైన్ వేదికను సంప్రదిస్తే కొద్ది మొత్తంలో డబ్బులు తీసుకొని వారి తరపున జనాదరణ పొందిన ఈవెంట్స్ సహా పలు ఇతర వేదికల్లో వీరు పార్టిసిపెంట్ అయినట్లు ఫేక్ చేయడంలో దాని నిర్వాహకులు సహాయపడతారు. అది దిల్జిత్ దోసాంజ్ కచేరి కావచ్చు లేదా అత్యంత ప్రాముఖ్యత కలిగిన కేఫ్ కావచ్చు. ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు ఈ సేవ కేవలం రూ. 99తో ప్రారంభమై ఈవెంట్‌ను బట్టి ఎంతైనా ఉండవచ్చు. దీని ద్వారా ప్రామాణికమైన స్టోరీస్‌లో ట్యాగ్ చేసే అవకాశం లభిస్తుంది. నిజానికి ఈ సర్వీస్ ఆయా వ్యక్తుల నిజ జీవితంతో సంబంధం లేకుండా వారిని ఆన్‌లైన్‌లో గొప్ప వ్యక్తులుగా, ఉత్తేజకరమైన జీవన శైలి కలిగిన వారిగా ప్రదర్శించడానికి, తద్వారా సోషల్ మీడియాను మిస్ అయ్యామన్న ఒత్తిడిని దూరం చేసుకోవడానికి సహాయపడుతుంది.
ఎలా పనిచేస్తుంది?
గెట్ యువర్ ఫ్లెక్స్ అనేది ఆశ్చర్యకరంగా ప్రొఫెషనల్ అండ్ స్ట్రెత్‌ఫార్వర్డ్ (straightforward)గా ఉంటుంది. ఈ ట్రెండ్‌ని అన్వేషించాలనే ఆసక్తి ఉన్నవారికి సేవలు అందిస్తుంది. కస్టమర్లు కచేరీలు, ట్రెండీ రెస్టారెంట్లు లేదా ఇతర వేదికల వంటి ఈవెంట్లను ఎంచుకోవచ్చు. ప్రతీ కేటగిరీలో తాము పాల్గొన్నట్లు కనిపిస్తూ పాపులారిటీ సంపాదించుకోవచ్చు. అందుకోసం గెట్ యువర్ ఫ్లెక్స్ సర్వీస్‌కు కొద్దిమొత్తంలో పే చేయాలి. ఇంట్లో నుంచే గూగుల్ పే ద్వారా చేయవచ్చు. ఈ సర్వీస్ ‘‘అందమైన వ్యక్తులు’’ ఉన్న ఫేక్ అండ్ ప్రైవేట్ ఇన్ స్టాగ్రామ్ ఖాతాలను ప్రొఫైల్ చిత్రాలుగా ఉపయోగిస్తుంది. తరచుగా కస్టమర్ ఆసక్తి, ఎంపిక ప్రకారం ఆయా ఈవెంట్ నుంచి స్టోరీస్ చేస్తూ ట్యాగ్ చేస్తుంది. తద్వారా ఒక వ్యక్తి ఈవెంట్‌లో పాల్గొనకపోయినా నిజంగానే పాల్గొన్నట్లు నమ్మదగిన వీడియోను గెట్ యువర్ ఫ్లెక్స్ క్రియేట్ చేస్తుంది. పాపులర్ ఇన్‌ఫ్లుయెన్సర్ల ప్రొఫైల్స్ అన్నింటా ట్యాగ్ చేస్తుంది. ఆ తర్వాత యూజర్ ఓన్ ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్‌కు కూడా స్టోరీని రిపోస్ట్ చేయవచ్చు.
లాభమా.. నష్టమా?
‘‘గెట్ యువర్ ఫ్లెక్స్’’ వంటి సేవల పెరుగుదల ప్రజల్లో ఉన్నలోతైన సామాజిక ధోరణిని (deeper societal trend), ఆసక్తిని సూచిస్తుంది. ఆన్‌లైన్ లేదా సోషల్ మీడియాలో తాము కనిపంచాలనుకున్న వ్యక్తులకు తమ అభిరుచులను నెరవేర్చుకునే అవకాశం కల్పిస్తుంది. వ్యక్తులు తమ పోస్ట్‌లు, స్టోరీలు సొంతంగా క్రియేట్ చేసి పోస్టు చేసుకోలేనప్పుడు ఈ సర్వీస్‌ను సంప్రదిస్తే వారే వీరి తరపున పోస్ట్‌లు, ట్యాగ్‌లు అన్నీ చేస్తారు. ఇక్కడ వాలిడేషన్ కల్చర్ ప్రముఖంగా పనిచేస్తుంది. లైకులు, కామెంట్స్, డిజిటల్ వాలిడేషన్‌గా పనిచేస్తాయి. అయితే ఈ ధోరణి ఎక్కువైతే రియాలిటీకి బదులు ప్రజలు తమను ఫేక్ చేసే పోస్టులతో భ్రమల్లో కూరుకుపోయే అవకాశం కూడా పెరగొచ్చు. అయితే ఇప్పటి వరకైతే అలాంటి నెగెటివిటీ ఏదీ లేదని నిపుణులు చెబుతున్నారు.
Read More...
Vitamin D : అత్యధిక మందిలో విటమిన్ డి లోపం..! కారణం ఇదే..