Water heaters: కొత్త-పాత మోడల్ వాటర్ హీటర్లకు తేడాలివే.. ఇది కొంటే ప్రాణాలకే ప్రమాదం?
ప్రస్తుత రోజుల్లో చాలా మంది వాటర్ హీటర్ ఉపయోగిస్తున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో చాలా మంది వాటర్ హీటర్(Water heaters) ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా చలికాలం(winter)లో అయితే తప్పకుండా హీటర్ ఉండాల్సిందే. చల్లని వాతావరణానికి నార్మల్ వాటర్‌తో స్నానం చేయాలంటే జనాలు వణికిపోతుంటారు. కాగా కొంతమంది హీటర్ వాడుతుంటారు. కానీ ఈ హీటర్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ప్రాణాలకే ప్రమాదమని చెబుతున్నారు నిపుణులు. అయితే ఏ రకం హీటర్ వాడితే సేఫ్ మరీ.. అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. సాధారణంగా మార్కెట్‌లో చాలా రకాల హీటర్లు ఉంటాయి. కాగా అందరూ వారికి నచ్చినవి కొంటుంటారు.
అయితే కొన్ని ఆటోమేటిక్ సిస్టమ్ హీటర్లు(Automatic system heaters) అమ్ముతారు. వాటర్ వేడయ్యాక.. దానంతట అదే ఆఫ్ అయిపోతుంది. మనం ఆఫ్ చేయాల్సిన పని ఉండదు. మరికొన్నిటికి ఆటోమేటిక్ ఆఫ్ ఆప్షన్ అనేది ఉండదు. ఈ పాత మోడల్ హీటర్ వాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. హీటర్ వద్దకు చిన్నపిల్లల్ని వెళ్లనివ్వకూడదు. అంతేకాకుండా బకెట్‌లో వాటర్ కొలత సరిగ్గా చూసుకుని పోయాలి. కొలతను మించి మునగకుండా హీటర్‌ను చూసుకోవాలి.
లేకపోతే షాక్ కొడుతోంది. అలాగే కరెంట్ ప్రాబ్లమ్ ఉన్నా.. ప్రమాదం జరిగే చాన్స్ ఉంటుంది. కాగా దాదాపు కొత్త మోడల్ ఆటోమేటిక్ ఆఫ్ అయ్యే హీటర్ ఎంపిక చేసుకుంటే బెటర్ అని సూచిస్తున్నారు నిపుణులు. అలాగే కొత్త మోడల్ హీటర్లు కొనాలనుకుంటే ఐఎస్‌ఐ ఉన్నది కొనుగోలు చేస్తే బెటర్. అలాగే కొనేముందు ఓసారి స్టార్ రేటింగ్(Star rating) కూడా చెక్ చేస్తే మేలు.
అయితే తక్కువ రేట్ అని పాత మోడల్ హీటర్లు కొనకుండా స్టార్ రేటింగ్, ఐఎస్‌ఐ మార్క్(ISI Mark) ఉన్న హీటర్లు కొంటే సురక్షితమని నిపుణులు చెబుతున్నారు. నాణ్యత లేని హీటర్లు పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అలాగే ఏ రకపు వాటర్ హీటర్ అయినా ఉపయోగించే ముందు.. కొన్నాక.. నిపుణులు సలహాలు తీసుకోండి. వాటర్ హీటర్‌ను బాత్రూమ్‌లో ఏ భాగంలో పెట్టాలి. హీటర్ మీద పొరపాటున వాటర్ పడితే ఏమి కాదా? ఏదైనా ప్రమాదముంటుందా? వంటి ప్రశ్నలకు సమాధానాలు అడిగి తెలుసుకుంటే బెటర్.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.