స్పెషల్ పర్సన్‌ను పరిచయం చేసిన టాలీవుడ్ యంగ్ హీరో.. ఆరేళ్ల ప్రేమ అంటూ పోస్ట్
గత కొద్ది కాలంగా టాలీవుడ్ హీరోలు ఒకరి తర్వాత ఒకరు పెళ్లిళ్లు చేసుకుంటూ బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్తున్న విషయం తెలిసిందే.
దిశ, సినిమా: గత కొద్ది కాలంగా టాలీవుడ్ హీరోలు ఒకరి తర్వాత ఒకరు పెళ్లిళ్లు చేసుకుంటూ బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్తున్న విషయం తెలిసిందే. డిసెంబర్ మొదటి వారంలో నాగచైతన్య(Naga Chaitanya), శోభిత ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక రెండు వారంలో ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు, హీరో శ్రీసింహా(Sri Simha) కూడా పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు అయ్యాడు.
నటుడు, రాజకీయ నాయకుడు మురళీమోహన్(Muralimohan) మనవరాలు రాగ- శ్రీసింహా డిసెంబర్ 14న దుబాయిలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా బయటకు రావడంతో నెటిజన్లు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో.. తాజాగా, శ్రీసింహా తన లైఫ్‌లోని స్పెషల్ పర్సన్‌ను పరిచయం చేశాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్(Instagram) ద్వారా ఓ పోస్ట్ కూడా పెట్టాడు. ‘‘ఇప్పటికీ ఆరేళ్లయింది. ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. రాసిపెట్టి ఉంది’’ అనే క్యాప్షన్ జత చేసి పలు ఫొటోలు షేర్ చేశాడు. ప్రస్తుతం వీరిద్దరి పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.