Balakrishna: ‘డాకు మహారాజ్’ సెకండ్ సింగిల్ చిన్ని సాంగ్ విడుదలకు ముహూర్తం ఫిక్స్
నందమూరి బాలకృష్ణ(Balakrishna) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj ).
దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ(Balakrishna) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’(DaakuMaharaaj ). దీనికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి(Bobby Kolli) దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sitara Entertainments) బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ(Surya Devaranaga Vamsi), సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇందులో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ‘డాకు మహారాజ్’ నుంచి విడుదలైన పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ ‘ది రేజ్ ఆఫ్ డాకు’(The Rage of Daku) మూవీపై భారీ అంచనాలను పెంచాయి.
అయితే హై ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య డాకు మహారాజ్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ క్రమంలో.. ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్ ఈ సినిమా నుంచి ఏదో ఒక అప్డేట్స్‌ను విడుదల చేస్తూనే ఉన్నారు. తాజాగా, ఇందులోంచి సెకండ్ సింగిల్(Second single) రాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. చిన్ని సాంగ్ డిసెంబర్ 23న సాయంత్రం 4:29 గంటలకు రాబోతున్నట్లు చిన్న పాపతో బాలయ్య ఆడుకుంటున్న పోస్టర్(Poster)ను షేర్ చేశారు.
A heartwarming melody for all music lovers 💌#DaakuMaharaaj 2nd single #Chinni will be out TOMORROW at 04:29pm! ❤️
— Sithara Entertainments (@SitharaEnts) December 22, 2024
A @MusicThaman Musical 💕🎹
A @dirbobby Film 💥
In Cinemas Worldwide from Jan 12, 2025. 🔥
𝑮𝑶𝑫 𝑶𝑭 𝑴𝑨𝑺𝑺𝑬𝑺 #NandamuriBalakrishna @thedeol @Vamsi84… pic.twitter.com/VN1UePgYyE