Pink Pineapple: పోషకాలు పుష్కలంగా ఉండే పింక్ పైనాపిల్స్ ఎక్కడ పండిస్తారు.. ఎన్నిడేస్ నిల్వ ఉంటాయి?
అందరూ ఇష్టపడే పండ్లలో తియ్యని, పుల్లని రుచి కలిగి ఉండే పైనాపిల్ ఒకటి.
దిశ, వెబ్డెస్క్: అందరూ ఇష్టపడే పండ్లలో తియ్యని, పుల్లని రుచి కలిగి ఉండే పైనాపిల్ ఒకటి. ఈ పండులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు నిండి ఉన్నాయి. విటమిన్స్, పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే పైనాపిల్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది మధుమేహ వ్యాధితో బాధపడేవారికి మంచి ఔషధం. గుండె సమస్యలను తరిమి కొడుతుంది. క్యాన్సర్ ఫ్రీ రాడికల్స్ తో పోరాడటంలో ఎంతో మేలు చేస్తుంది. పైనాపిల్ లో ఉండే యాంటీ యాక్సిడెంట్స్ కంటి చూపును మెరుగుపరుస్తాయి.
మరో కలర్ పైనాపిల్ ఏంటి..?
అయితే ఇన్ని ప్రయోజనాలున్న పైనాపిల్ లో మరో రంగు పైనాపిల్ ఉందని చాలా మందికి తెలియదు. అదే పింక్ కలర్ పైనాపిల్. దీనిలో లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇది జన్యుపరంగా గులాబీ రంగులో ఉంటుంది కాబట్టి దట్టమైన పోషకాలు ఉంటాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ పండు అరుదుగా దొరుకుతుంది. కానీ ప్రయోజనాలు అనేకం.
రుచి ఎలా ఉంటుంది..?
దీని రుచి కూడా పసుపు కలర్ లో ఉండే పైనాపిల్ మాదిరిగానే ఉంటుంది. దానికంటే మరింత తియ్యగా ఉంటుంది. దీనిలో పులుపు కాస్త తక్కువగా ఉంటుంది. ఈ పింక్ కలర్ పైనాపిల్ ను సుంగధాల్లో వాడుతారు.
ఎక్కడ దొరుకుతాయి..?
ఈ పింక్ కలర్ పైనాపిల్స్ ఎక్కువగా అమెరికా, కెనడాలో అమ్ముతారు. ఎక్కువగా అక్కడే అందుబాటులో ఉంటాయి. ఈ పండు ఆన్లైన్లో అవైలేబుల్ లో ఉంటుంది. ఆర్డర్ చేస్తే పింక్ పైనాపిల్ సర్టిఫికెట్, రెసిపీకి సంబంధించిన ఓ బుక్ లెట్ కూడా బాక్స్ లో వస్తుంది. కానీ ఇవి రెండు, మూడ్రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి.
ఎక్కడ పండిస్తారు..?
గులాబీ రంగు పైనాపిల్స్ డెల్మెంటే అనే సంస్థ ఉత్పత్తి చేస్తుంది. దక్షిణ మధ్య కోస్టా రికాలో పొలంలో పండిస్తారు. అగ్నిపర్వతాల నేల, ఉష్ణమండల వెదర్ లో పండిస్తారు. పైనాపిల్ ను కాండం లేకుండా రవాణా చేస్తారు. ఈ పండు తింటే హార్ట్ ఎటాక్ ప్రాబ్లమ్స్ దరి చేరవు. అలాగే క్యాన్సర్ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.
గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.