దిశ, ఫీచర్స్: శరీరంలో ఎముకలు, దంతాలు ఎంతో ముఖ్యమైనవి. అవి గట్టిగా ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. అంతేకాదు శరీరంలోని సున్నితమైన అవయవాల చుట్టూ ఎముకలు బయటి గాయాలు తగలకుండా రక్షణగా పనిచేస్తుంటాయి. అలాగే దంతాలు బలంగా ఉన్నప్పుడే ఎటువంటి ఆహారం అయినా తీసుకోగలుగుతాం. అందుకే వాటి బలోపేతానికి కావాల్సిన ఆహార నియమాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
విటమిన్లు, కాల్షియం..
విటమిన్ డి, కాల్షియం చాలా ముఖ్యం. కండరాల పనితీరుకు, ఎముకలు, దంతాలు బలంగా ఉండేందుకు దోహదం చేస్తాయి. విటమిన్ డి అనేది శరీరం కాల్షియాన్ని గ్రహించడంలో సహాయ పడుతుంది. అంతేకాకుండా విటమిన్ కె, విటమిన్ సి, మెగ్నీషియం, ఫాస్పరస్ ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కాబట్టి అవి లభించే తాజా కూరగాయలు, ఆకుకూరలు, చేపలు, పాల ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవడం మంచిది.
సోయాబీన్స్..
సోయాబీన్స్‌లో ప్రోటీన్, కాల్షియం ఉండటంవల్ల ఎముకల బలానికి దోహదం చేస్తాయి. సోయా ఆధారిత ఉత్పత్తులను తీసుకోవడంవల్ల రుతుక్రమం ఆగిపోయిన మహిళల్లో కూడా ఎముకలు బలోపేతం అవుతాయని కొలంబియాలోని మిస్సౌరీ యూనివర్సిటీకి చెందిన అధ్యయనకర్తలు పేర్కొంటున్నారు.
పాలు..
కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, విటమిన్, ఎ, డి కలిగిన సంపూర్ణ ఆహారం పాలు. రోజూ ఒకగ్లాసు పాలు తాగడం మూలంగా ఎముకలు దృఢంగా ఉంటాయి.
బ్రోకలీ..
బ్రోకలీ అనేక ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి. ఇందులో కాల్షియం, విటమిన్ సి, పొటాషియం, ఫాస్పరస్, ఫోలేట్, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. బ్రోకలీని తరచూ ఆహారంగా ఉపయోగించడంవల్ల ఎముకలు, దంతాలు బలంగా తయారవుతాయి. బరువు తగ్గడానికి, అధిక రక్తపోటు నివారణకు మేలు చేస్తుంది. క్యాన్సర్, డయాబెటిస్ ప్రభావాలు తగ్గడానికి బ్రోకలీ సహాయపడుతుంది.
ఇవి కూడా చదవండి: