పూజ మధ్యలో తుమ్ములు, దగ్గు వస్తే ఏం చేయాలి?

పూజ మధ్యలో ఉండగా తుమ్ములు, దగ్గు లాంటివి వస్తే ఏం చేయాలి?

Update: 2023-07-18 05:40 GMT

దిశ, వెబ్ డెస్క్: మనలో ఇప్పటికి కొందరు మూఢ నమ్మకాలను నమ్ముతుంటారు. మరి కొందరు ఏమి పట్టించుకోకుండా వారి పనులు వారు చేసుకుంటూ పోతారు.  నమ్మిన వారు వాటిని ఆచరిస్తారు. చాలా మందికి ఏదైనా పూజ మధ్యలో ఉండగా తుమ్ములు, దగ్గు లాంటివి వస్తే ఏం చేయాలి? ఆ పూజ, ఆ ప్రదేశం అపవిత్రమవుతుందా? అనే విషయాల పట్ల సందేహాలు ఉన్నాయి.. వాటి గురించి ఇక్కడ పూర్తిగా తెలుసుకుందాం..

మన శరీరంలో వాయువే ప్రాణధారము, ప్రాణము కూడా.. ఈ వాయువు, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనే ఐదు రకాలుగా ఉంటుంది. వీటినే  మనం పంచ ప్రాణాలు అని అంటాము. వీటి వల్లే మనకి తుమ్ము, దగ్గు, ఆవలింతలు, అపానవాయువు వస్తుంటాయి. కానీ పూజ మధ్యలో గట్టిగా తుమ్మడం, దగ్గడం ఇలాంటివి చేస్తే అపచారమే. ఐతే శరీరంలో అసంకల్పితంగా జరిగే వీటిని నియంత్రించలేము. అందువల్ల ఇలాంటప్పుడు ఏమి చేయాలంటే శాస్త్రాన్ని అనుసరించి తుమ్ము వచ్చినా, అపానవాయువు విడిచినా, కన్నీరు, కోపం వంటి భావోద్వేగాలు కలిగినా, ఆచమనం చేస్తే.. ఆ దోషం పోతుంది. అలాగే రుతుక్రమంలో ఉన్న స్త్రీలు, మైలలో ఉన్న వారు ఆచమనం చేసి, కుడి చేతితో కుడి చెవిని తాకాలి. ఇలా చేస్తే ఆ దోషం పోతుంది. 

గమనిక: పైన రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. దీనిని 'దిశ' ధృవీకరించట్లేదు

ఇవి కూడా చదవండి:

మంచి ఆరోగ్యం కోసం.. వీటిని పాటిస్తే చాలు

వర్షంలో టూవీలర్ నడుపుతున్నారా..? అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే


Similar News