నవజాత శిశువు బరువు ఎంత ఉండాలి.. బరువు తగ్గితే ఏమి జరుగుతుందో తెలుసా ?

పిల్లలు పుట్టగానే వైద్యులు ముందుగా వారి బరువును కొలిచి నోట్ చేసుకుంటారు.

Update: 2024-10-01 12:45 GMT

దిశ, వె‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్ : పిల్లలు పుట్టగానే వైద్యులు ముందుగా వారి బరువును కొలిచి నోట్ చేసుకుంటారు. అయితే పుట్టిన సమయంలో శిశువులు సాధారణ బరువు కంటే తక్కువ బరువు ఉన్నారంటే వారు శారీరకంగా బలహీనంగా ఉన్నట్టు నిర్ధారిస్తారు. బిడ్డ సరిగ్గా అభివృద్ధి చెందలేదని, ఆ నవజాత శిశువు విషయంలో జాగ్రత్త వహించాలని చెబుతుంటారు. అలాంటి పిల్లలు చాలా బలహీనంగా ఉంటారు. అనేక వ్యాధుల ప్రమాదం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు నిపుణులు.

సాధారణ బరువు ఎంత ఉండాలి ?

పుట్టినప్పుడు పూర్తికాల శిశువు బరువు 2.5 కిలోల కంటే ఎక్కువగా ఉండాలని చెబుతున్నారు. 10వ నెలలో జన్మించిన పిల్లల బరువు 3 నుండి 4 కిలోల వరకు పెరుగుతుంది. అయితే దీనికి విరుద్ధంగా నెలలు నిండకుండానే అంటే ఏడవ లేదా ఎనిమిదవ నెలలో పుట్టిన పిల్లల బరువు తరచుగా సాధారణ బరువు కంటే తక్కువగా ఉంటుందంటున్నారు. అలాగే ఒక స్త్రీకి కవలలు ఉన్నప్పటికీ, పిల్లల బరువు సాధారణం కంటే తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. పుట్టిన సమయంలో 2.5 నుండి 3 కిలోల బరువున్న శిశువు ఆరోగ్యంగా ఉన్నట్టు పరిగణిస్తారు. 1.5 కిలోల కంటే తక్కువ బరువు ఉన్న శిశువును తక్కువ బరువుతో పుట్టిన బిడ్డ అని అంటారంటున్నారు నిపుణులు.

తక్కువ బరువుతో పుట్టడం ప్రమాదకరం..

పుట్టిన సమయంలో బిడ్డ బరువు తక్కువగా ఉండటం మంచిది కాదని చెబుతున్నారు. కొన్ని సార్లు శరీరంలోని అవయవాలు అభివృద్ధి చెందనప్పుడు, బిడ్డ నెలలు నిండనప్పుడు బరువు తగ్గుతుందట. అలాంటి పిల్లలు తమంతట తాముగా పాలు తాగే స్థితిలో కూడా ఉండరని చెబుతన్నారు. కాబట్టి అలాంటి పిల్లలకు అదనపు జాగ్రత్త అవసరం అంటున్నారు. అలాగే కొన్నిసార్లు అలాంటి పిల్లలకు శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది ఉంటుందట. అందుకే వారిని పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో సహాయక వ్యవస్థలో ఉంచుతారని నిపుణులు చెబుతున్నారు.

కామెర్లు..

సాధారణ బరువు ఉన్న పిల్లల కంటే తక్కువ బరువు ఉన్న పిల్లలకు కామెర్లు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. ఈ పిల్లలలో బిలిరుబిన్ లేకపోవడం వల్ల పుట్టిన సమయంలో వారి శరీరం పసుపు రంగులోకి మారుతారట. అలాంటి సందర్భాలలో ఈ పిల్లలకు ఫోటో థెరపీ ఇస్తారని చెబుతున్నారు. పిల్లలను ఇంక్యుబేటర్‌లోని లైట్ కింద పడుకోబెట్టి, ప్రకాశవంతమైన కాంతి పిల్లల కళ్ల పై పడకుండా కళ్లు కప్పి ఉంచే చికిత్స ఇది. దీంట్లో ఉంచిన తర్వాత, పిల్లల బిలిరుబిన్ చెక్ చేస్తుంటారు.

సంక్రమణ ప్రమాదం..

సాధారణంగా చిన్న పిల్లలందరికీ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుందంటున్నారు. కానీ సాధారణం కంటే తక్కువ బరువు ఉన్న పిల్లలకు చాలా తక్కువ రోగనిరోధక శక్తి కారణంగా మళ్లీ మళ్లీ ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఉంటుందంటున్నారు.

రక్తహీనత ప్రమాదం..

బరువు లేకపోవడం వల్ల, బిడ్డ రక్తహీనతతో బాధపడవచ్చు, అంటే రక్తం లేకపోవడం అన్నమాట. ఈ పిల్లలకు శరీరంలో ఐరన్ లోపం ఉంటుందంటున్నారు. ఇలా శిశువులకు రక్తమార్పిడి చేయవలసి ఉంటుందంటున్నారు నిపుణులు.

పిల్లల బరువును ఎలా నిర్వహించాలి..

గర్భధారణ సమయంలో తల్లి తన ఆహారపు అలవాట్ల పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అలాగే పిల్లల బరువును ఎప్పటికప్పుడు అల్ట్రాసౌండ్ సహాయంతో పర్యవేక్షించాలని చెబుతున్నారు. తద్వారా బిడ్డ ఆరోగ్యకరమైన బరువుతో పుట్టి ఆరోగ్యంగా ఉంటాడని చెబుతున్నారు.

* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు.


Similar News