రూట్‌ కెనాల్‌- హార్ట్ ఎటాక్‌ మధ్య సంబంధం ఏంటి? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు

మానవ శరీరంలో దంతాలు కీలక పాత్ర పోషిస్తాయి.

Update: 2024-09-25 13:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: మానవ శరీరంలో దంతాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఆహారపదార్థాలను నమలడంలో మేలు చేస్తాయి. ఈ క్రమంలోనే దంత సమస్యలు ఏర్పడతాయి. తద్వారా రూట్ కెనాల్ వంటి థెరఫీలు చేయించుకోవాల్సి వస్తుంది. దీంతో గుండెకు సంబంధించిన వ్యాధులు తలెత్తుతాయి. మీ దంతాలకు అండ్ హార్ట్ కు సంబంధం ఏంటి అనేది తాజాగా నిపుణులు వెల్లడించారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..


కేవలం అపోహ మాత్రమే..

అయితే చాలా మంది రూట్ కెనాల్స్ ట్రీట్మెంట్ తీసుకుంటే హార్ట్ ఎటాక్ వస్తుందని భావిస్తారు. కానీ గుండెపోటు వస్తుందనేది కేవలం అపోహ మాత్రమే అని తాజాగా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానీ గుండె, దంత ఆరోగ్యం మధ్య బలమైన సంబంధం ఉందని చెబుతున్నారు. దంతాల అపరిశుభ్రత చిగుళ్ల వ్యాధులకు కారణమవుతుంది. దీంతో బ్యాక్టీరియా రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తుంది. కాగా హార్ట్ ఎటాక్ ప్రాబ్లమ్స్ వస్తాయి.

రూట్ కెనాల్ చికిత్స వల్ల గుండెకు నో ప్రాబ్లమ్

రూట్ కెనాల్ ట్రీట్మెంట్‌లో వ్యాధిగ్రస్త కణజాలాన్ని టీత్స్ నుంచి తీయడానికి డాక్టర్లు ఆపరేషన్ చేస్తారు. ముందుగా దంతాలకు హాని కలగకుండా ఉండటానికీ బాక్టీరియాను తొలగిస్తారు. పంటి మధ్యన ఏర్పడిన ఖాళీ స్థలాన్ని ఓ ప్రత్యేక పదార్థంలో పూడ్చుతారు. తర్వాత తీసి పారేయాల్సిన దంతాన్ని సేఫ్‌గా కాపాడుతారు. ఈ ఆపరేషన్ మొత్తం కామన్ అనస్థీషియా ఇచ్చిన తర్వాత చేస్తారు. కాగా ఇతర సమస్యలు తలెత్తే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా రూట్ కెనాల్‌ చికిత్స వల్ల గుండెకు పెద్దగా ప్రాబ్లమ్ ఉండదు.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.


Similar News