Sleepmaxing: స్లీప్‌మ్యాక్సింగ్ అంటే ఏంటి? ఈ పరికరాలకు భారీగా పెరుగుతోన్న డిమాండ్

జీవన శైలిలో మార్పుల కారణంగా ప్రజెంట్ డేస్‌లో చాలా మందికి సరైన నిద్ర ఉండట్లేదు.

Update: 2024-09-24 14:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: జీవన శైలిలో మార్పుల కారణంగా ప్రజెంట్ డేస్‌లో చాలా మందికి సరైన నిద్ర ఉండట్లేదు. కొంతమంది ఫోన్లకు బానిసవ్వడం వల్ల నిద్రను పక్కన పెడుతున్నారు. నైట్ రెండు, మూడు గంటల వరకు స్మార్ట్ ఫోన్లల్లో మునిగి తేలుతున్నారు. దీంతో పలు ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు సూచిస్తున్న ఆ మాటలన్నీ పెడచెవిన పెడుతున్నారు. నిద్ర సరిగ్గా లేకపోతే నెక్ట్స్ డే నీరసంగా ఉంటారు.

సుఖవంతమైన నిద్ర కోసం..

మరికొంతమంది నిద్రకు ప్రాధాన్యత ఇచ్చి.. కంటినిండా నిద్రించేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్లీప్ మ్యాక్సింగ్ అనే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ధ్యానం, బుక్స్ చదవడం వంటివి అలవాటు చేసుకుని సుఖవంతమైన నిద్రను పొందుతున్నారు. మరీ స్లీప్ మ్యాక్సింగ్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం..

స్లీప్‌మ్యాక్సింగ్ అంటే ఏంటి?

నైట్ నిద్రలో నాణ్యతను పెంచడాన్ని స్లీప్ మ్యాక్సింగ్ అంటారు. కాగా ఇందుకోసం చాలా రకాల పరికరాలు, టెక్నిక్స్ ఉపయోగిస్తున్నారు. నిద్రకు డిస్టబెన్స్ గా ఉండే గురకకు చెక్ పెట్టేందుకు మెగ్నీషియమ్ ఆయిల్, మౌత్ టేప్, ఇతర సప్లిమెంట్స్ వాడకం, రెడ్ లైట్ థెరపీ, స్లీప్ ట్రాకర్స్, మెలటోనిన్ సప్లిమెంట్స్, టార్ట్ చెర్రీ జ్యూస్, అశ్వగంధ వాడకం, జా ట్రాప్స్ వంటివి మంచి నిద్రకు దోహదపడుతున్నాయి. మొదట్లో అమెరికాలో ప్రారంభమైన ఈ స్లీప్ మ్యాక్సింగ్ ప్రస్తుతం అన్ని దేశాలకు స్ప్రెడ్ అవుతుంది.

ఫ్యూచర్‌లో భారీగా డిమాండ్..

ఈ సంత్సరం ఇండియాలో స్లీప్‌మ్యాక్సింగ్ పరికరాలు మార్కెట్ 28 మిలియన్ డాలర్లకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ స్లీప్ మ్యాక్సింగ్ పరికరాలకు భారీగా డిమాండ్ పెరుగుతుందని అంటున్నారు. నిద్రలేమికి హైబీపీ, కిడ్నీ సమస్యలు, స్ట్రోక్, షుగర్ వ్యాధి వంటి సమస్యలు కూడా కారణమని నిపుణులు చెబుతున్నారు. కాగా నిద్ర కోసం అతిగా ఆరాటపడటం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాగా రాత్రి నిద్ర కోసం పుస్తకాలు చదవండి, యోగా చేయండని సూచిస్తున్నారు.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.


Similar News