పిల్లల్లో పరోస్మియా.. స్మెల్ థెరపీతో చెక్!

Update: 2022-01-23 10:59 GMT

దిశ, ఫీచర్స్ : కొంతమందిలో 'పరోస్మియా'కు కొవిడ్ కారణమవుతుందని ఇదివరకే వైద్యులు పేర్కొన్నారు. ఇది వాసన తో సంబంధం ఉన్న గ్రాహకాలు, నరాలను తాత్కాలికంగా దెబ్బతీస్తుంది. అయితే కరోనా నుంచి కోలుకున్న తర్వాత కొంతమంది పిల్లలు రుచి, వాసన లో మార్పు చెందిన భావాన్ని ప్రదర్శిస్తూ 'ఫస్సీ ఈటర్స్' గా మారుతున్నారని ఈస్ట్ ఆంగ్లియా విశ్వవిద్యాలయం (UEA) నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెద్దల్లో 'పరోస్మియా' లక్షణాలు కనిపించడం సాధారణం కాగా, ఈ రుగ్మత పిల్లలు కూడా అనుభవిస్తున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది.

UKలో 250,000 మంది పెద్దలు కోవిడ్ ఇన్ఫెక్షన్ కారణంగా 'పదో మియా తో బాధపడుతున్నారని సమాచారం. అయితే గత కొన్ని నెలలుగా ముఖ్యంగా గత సెప్టెంబర్‌ నుంచి ఇది పిల్లలపై కూడా ప్రభావం చూపుతుందని పరిశోధకులు గుర్తించారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ రుగ్మత పిల్లలు తినే ఆహారం నుంచి కుళ్ళిన మాంసం లేదా రసాయనాల వంటి అసహ్యకరమైన వాసన లేదా రుచిని అనుభవిస్తుంది.

ఏం చేయాలి?

రుచులను నిరోధించేందుకు తినేటప్పుడు మృదువైన ముక్కు క్లిప్‌ని ఉపయోగించడం పిల్లలకు నేర్పించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వాసన శిక్షణ కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో భాగంగా యూకలిప్టస్, నిమ్మకాయ, గులాబీ, దాల్చిన చెక్క, చాక్లెట్, కాఫీ లేదా లావెండర్ - రోజుకు రెండుసార్లు, ప్రతిరోజూ పిల్లలతో వాసన చూపించాలి. పిల్లలు చప్పగా ఉండే ఆహారాన్ని తినడానికి ప్రయత్నించాలి. ప్రస్తుతానికి ఘాటైన వాసనలు రాకుండా చూసుకోవాలి.

కిటికీలు తెరవాలి లేదా ఆహారం తినే సమయంలో ఫ్యాన్‌ని ఆన్‌లో ఉంచాలి. మీరు మీ పిల్లలకు గది ఉష్ణోగ్రత వద్ద ఆహారాన్ని తినేలా చూడాలి. తద్వారా వారు వాసన చూడలేరు. వెనీలా లేదా ఫ్లేవర్ లేని ప్రోటీన్, విటమిన్ మిల్క్‌షేక్‌లు పిల్లలకు అవసరమైన పోషకాలను రుచి లేకుండా పొందడంలో సహాయపడతాయి. అయితే ఇది స్వీయ-పరిమితం చేసే తాత్కాలిక సమస్య కాబట్టి తీవ్రమైన చికిత్స అవసరం లేదని గ్రహించాలి.

కోవిడ్-19 నుండి కోలుకున్న తర్వాత ఈ లక్షణం కొందరిలో కనిపించవచ్చు. అయితే ఇది స్వల్పంగా ఉంటుంది. ఈ లక్షణాన్ని పిల్లల్లోనూ చూడవచ్చు. గ్రాహకాలు దెబ్బతినడం వల్ల అది వారు తినే ఆహారం పై ప్రభావం చూపుతుంది. దీంతో పిల్లలు ఒకప్పుడు చాక్లెట్‌తో సహా చాలా ఇష్టపడే ఆహారాన్ని తినడం కష్టం గా అనిపించవచ్చు. కొంతమంది పిల్లలు పూర్తిగా తినడం మానేస్తారు. ఆహార పదార్థాలు చెత్త లేదా మురుగునీరు లేదా అమ్మోనియా/ సల్ఫర్ లేదా కుళ్ళిన గుడ్లు వంటి వాసన కలిగి ఉంటాయి.

దీని గురించి ఇప్పటికీ శాస్త్రవేత్తలకు పూర్తిగా అర్థం కాలేదు కానీ వాసన సరిగా లేని పిల్లల్లో 94.3 శాతం మంది ఒక నెలలోనే కోలుకున్నారు. రెండు నెలల్లో దాదాపు 100 శాతం మంది దీన్నుంచి బయటపడ్డారు. అయితే పెద్దవారిలో కంటే చిన్నారుల్లో వాసన పనిచేయకపోవడం వేగంగా పునరుద్ధరిస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే కేవలం 12.8 శాతం మందికి మాత్రమే వాసన, రుచి అసాధారణతలు ఉన్నట్లు అధ్యయనాలు సూచిస్తున్నాయి.

- డాక్టర్ జగదీష్ కత్వాటే, నియోనాటాలజిస్ట్, శిశువైద్యుడు, పూణే

Tags:    

Similar News