Emotional eating: ఎమోషనల్ ఈటింగ్ అంటే ఏంటి? ఎలా ఆపాలి?

ప్రజెంట్ డేస్‌లో చాలా మంది బిజీ లైఫ్ కారణంగా తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు.

Update: 2024-09-21 12:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రజెంట్ డేస్‌లో చాలా మంది బిజీ లైఫ్ కారణంగా తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో ఎన్నో వ్యాధులు కొనితెచ్చుకుంటున్నారు. ముందే కేర్ తీసుకోకుండా సమస్య వచ్చి నెత్తి మీద పడ్డాక దానికి దారి వెతుక్కుంటున్నారు. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఇది కామన్ అయిపోయింది. అయితే ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు కొంతమంది అధికంగా ఫుడ్ తీసుకుంటారు. దీనినే ఎమోషనల్ ఈటింగ్ అని అంటారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు చాలా మంది సతమతమవుతున్నారు. తాజాగా దీనికి సొల్యూషన్‌ను నిపుణులు కనుగొన్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

ఎమోషనల్ ఈటింగ్ సమస్య మిమ్మల్ని వెంటాడితే మీరు ఒక డైరీ మెయింటైన్ చేయడం మేలు. ఎందుకంటే ఏం ఫుడ్ తింటున్నారు. ఏ టైమ్‌లో తీసుకుంటున్నారు. అనేది డైరీలో రాసుకుంటే మీకు క్లారిటీ ఉంటుంది. అలాగే స్నేహితులతో టైమ్ స్పెండ్ చేయండి. ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. కేలరీలు, పోషకాలు అధికంగా ఉండే ఫుడ్ తీసుకోండి. వీటిపై దృష్టి సారించడం వల్ల ఎమోషనల్ ఈటింగ్‌కు చెక్ పెట్టొచ్చు.

స్ట్రెస్ ఉన్నప్పుడు బయటికి వెళ్లవద్దు. ఒత్తిడిగా ఫీల్ అవుతున్నప్పుడు బయటికి వెళ్తే.. ఎమోషనల్ ఈటింగ్ ప్రాబ్లమ్ మరింతగా పెరుగుతుంది. కాగా ఫుడ్ తినాలనిపించే సమయంలో బయట ఫుడ్ కాకుండా హెల్తీ స్నాక్స్ తీసుకోండి. ఫ్రూట్స్, కూరగాయలు తినండి. అలాగే తినాలన్న కోరిక కలిగినప్పుడు మెడిటేషన్ చేయడం మంచిది. ఇది ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఆరోగ్యం కూడా మరుగుపడుతుంది.

ఎమోషనల్ ఈటింగ్ నుంచి బయటపడేందుకు వ్యాయామం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. ప్రతి రోజూ వ్యాయామం చేయడం వల్ల స్ట్రెస్ తగ్గిపోతుంది. దీంతో ఎమోషనల్ ఈటింగ్ సమస్య దూరం అవుతుంది. ఈ సమస్య తీవ్రమైనప్పుడు మాత్రం డాక్టర్‌ను సంప్రదించడం చాలా ముఖ్యం. నేచురల్‌గా నిపుణులు చెప్పినవే కాకుండా వైద్యుడి సలహాలు, సూచనలు పాటిస్తే కూడా మంచి ఫలితాలు ఉంటాయి.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.


Similar News