కార్డియాక్ అరెస్ట్, గుండెపోటు ఒక్కటేనా?
ప్రస్తుతం చాలా మంది గుండెపోటుతో మరణిస్తున్నారు. చిన్న పిల్లలు కూడా ఉన్నట్లుండి కుప్పకూలి ప్రాణాలను వదులుతున్నారు. కార్డియాక్ అరెస్ట్ అటాక్
దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం చాలా మంది గుండెపోటుతో మరణిస్తున్నారు. చిన్న పిల్లలు కూడా ఉన్నట్లుండి కుప్పకూలి ప్రాణాలను వదులుతున్నారు. కార్డియాక్ అరెస్ట్ అటాక్ అవ్వడం, గుండె పోటు వచ్చింది అందుకే చనిపోయారు అంటూ చెప్పుకొస్తుంటారు. అయితే చాలా మంది కార్డియాక్ అరెస్ట్, గుండెపోటు ఒక్కటే అనుకుంటారు. కానీ నిజానికి ఇవి రెండు వేరు వేరు. కాగా, కార్డియాక్ అరెస్ట్ అంటే ఏమిటి, గుండె పోటు అంటే ఏమిటో తెలుసుకుందాం.
1. గుండె పోటు : గుండెకు రక్త ప్రసరణ ఆగినప్పుడు గుండె పోటు వస్తుంది. గెండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనిలో పూడికలు ఏర్పడిన ప్పుడు రక్తప్రసరణ దెబ్బతిని గుండెపోటు తలెత్తుతుంది.
2. కార్డియాక్ అరెస్ట్ : గుండె పనితీరు అస్తవ్యవస్తమై, హఠాత్తుగా కొట్టుకోవటం ఆగటాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు.గుండె రక్తాన్ని పంప్ చేసే ప్రక్రియ దెబ్బతింటుంది. అప్పుడు మెదడు, ఊపిరితిత్తులు, ఇతర అవయవాలకు గుండె రక్తాన్ని పంప్ చేయలేక చతికిల పడుతుంది. దీంతో కార్డియాక్ అరెస్ట్ అటాక్ అవుతోంది.