తల్లిదండ్రులతో కలిసి పడుకోవడంవల్ల పిల్లలకు నష్టం.. ఏం జరుగుతుందంటే..

మన దేశంలో ఆరేండ్లు దాటిన పిల్లలు కూడా తమ తల్లిదండ్రులతో కలిసి ఒకే మంచంపై పడుకోవడం చూస్తుంటాం. కానీ పాశ్చాత్య దేశాల్లో మాత్రం అలా కాదు.

Update: 2024-06-01 13:07 GMT

దిశ, ఫీచర్స్ : మన దేశంలో ఆరేండ్లు దాటిన పిల్లలు కూడా తమ తల్లిదండ్రులతో కలిసి ఒకే మంచంపై పడుకోవడం చూస్తుంటాం. కానీ పాశ్చాత్య దేశాల్లో మాత్రం అలా కాదు. పేరెంట్స్ తమ పిల్లలకు రెండేండ్ల వయస్సు రాగానే ఒకే రూములో సపరేట్ బెడ్‌పై కానీ, సపరేట్ బెడ్ రూములో కానీ పడుకోబెడుతుంటారు. చిన్నప్పటి నుంచే ధైర్యం, కాన్ఫిడెంట్, స్వతంత్ర భావాలు పెరగాలనే ఉద్దేశంతో ఇలా చేస్తుంటారు. పైగా వెస్ట్రన్ కంట్రీస్‌లో ఇది కచ్చితంగా అమలు చేయాల్సిన నియమంగా అక్కడివారు భావిస్తుంటారు. అలాగని పిల్లలు పేరెంట్స్‌తో కలిసి పడుకో కూడదు అనే కఠిన నిబంధనలు, చట్టాలు అయితే ఏమీ లేవు. అయితే నిపుణులు, హెల్త్ ఆర్గనైజేషన్లు మాత్రం సపరేషన్ స్లీప్‌‌ను సిఫార్సు చేస్తున్నాయి.

గైడ్‌లైన్స్ ఏం చెప్తున్నాయి?

అమెరికన్ అకాడెమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (AAP) సిఫార్సుల ప్రకారం.. తల్లి దండ్రులతో పిల్లలు వేరుగా పడుకోవడంవల్ల వారి పిల్లల ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్‌కు మంచిది. అలాగే పేరెంట్స్ తమ పిల్లలతో మొదటి ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం లేదా 18 నెలల వరకు మాత్రమే కలిసి ఒకే మంచంపై నిద్రించాలి. ఆ తర్వాత వేరుగా పడుకోబెట్టాలి. ఇక నేషనల్ స్లీప్ ఫౌండేషన్ ప్రకారం.. పిల్లలు 2 నుంచి 3 సంవత్సరాల మధ్య తల్లిదండ్రులతో కాకుండా తమ సొంత బెడ్‌పై మాత్రమే నిద్రించడం ఉత్తమం. యూకే నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) ప్రకారం అయితే రెండేండ్లు దాటిన పిల్లలు తమ పేరెంట్స్‌తో కలిసి ఓకే బెడ్‌పై నిద్రించకూడదు. అయితే ఈ గైడ్‌లైన్స్ అంతటా ఒకేలా ఉండకపోవచ్చు. దేశం, ప్రాంతం లేదా రాష్ట్రాన్ని బట్టి నిబంధనలు మారవచ్చునని నిపుణులు పేర్కొంటున్నారు.

సపరేషన్ స్లీప్ వల్ల బెనిఫిట్స్

తల్లిదండ్రులు రెండేండ్లు దాటిన పిల్లలను వేరుగా పడుకోబెట్టడంవల్ల పిల్లల్లో సడెన్ ఇన్‌ఫాంట్ డెత్ సిండ్రోమ్ (Sudden Infant Death Syndrome -SIDS) రిస్క్ తగ్గుతుంది. హెల్తీ స్లీప్ హాబిట్స్ అలవడుతాయి. మెరుగైన నిద్రకు దారితీస్తాయి. స్వీయ ఓదార్పు నైపుణ్యాలు, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. హెల్తీ పేరెంట్ - చైల్డ్ రిలేషన్ షిప్‌ను కొనసాగించగలగుతారు. అట్లనే పేరెంట్స్ కూడా పర్సనల్ డిస్టర్బెన్స్ లేకుండా ఉండటంతో వారి మానసిక ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. విడిగా పడుకోవడంవల్ల రాత్రిపూట నిద్రలో నడవడం, బెడ్ వెట్టింగ్ వంటి రిస్క్‌ తగ్గుతుంది.

కలిసి పడుకోవడంవల్ల నష్టాలు

రెండేండ్ల పిల్లలు కూడా పేరెంట్స్‌తో కలిసి నిద్రించడంవల్ల కొన్ని ఇబ్బందులు ఎదురు కావచ్చు. నిద్రమత్తులో ఉన్నప్పుడు పిల్లలు పిల్లోస్ మధ్యలో చిక్కుకుపోయి ఊపిరాడని పరిస్థితులు ఎదురు కావచ్చు. నిద్రలో దొర్లడం లేదా పక్కకు తిరిగే క్రమంలో కింద పడి గాయాలు కావచ్చు. పేరెంట్స్ అకస్మాత్తుగా కదలడం, ఉలిక్కి పడటం, స్పృహలేని స్థితిలో పిల్లలను గాయపర్చడం వంటివి జరగవచ్చు. పిల్లల్లో సెల్ఫ్‌నెస్ తగ్గిపోయి నిద్రపోవడానికి కూడా పేరెంట్స్‌పై ఆధారపడుతుంటారు. స్వీయ ఓదార్పు నైపుణ్యాల అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. నిద్రలో నడిచే అలవాటు ఉంటే ఏదైనా ప్రమాదం జరగవచ్చు. ఎప్పుడూ కలిసి పడుకోవడంవల్ల ఎమోషనల్ అండ్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్‌కు దారితీస్తుంది. తల్లిదండ్రుల మధ్య సాన్నిహిత్యం, కమ్యూనికేషన్ తగ్గడానికి కారణం అవుతుంది. దీనివల్ల సంబంధంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.


Similar News