Work Methods : పని.. పద్ధతులు.. ఒక్కొక్కరిలో ఒక్కో రకం!
Work Methods : పని.. పద్ధతులు.. ఒక్కక్కరిలో ఒక్కో రకం!
దిశ, ఫీచర్స్ : చేసే పనిని బట్టి సక్సెస్ వస్తుంది. చేసే పనిని బట్టే ఫెయిల్యూర్ కూడా చవిచూస్తాం. అలాగని ప్రతీ పని ఒకే రకమైన ఫలితాన్నిస్తుందని గానీ, భిన్న మైన ప్రభావాలు చూపుతుందని కానీ ఫిక్స్ అవ్వలేం. ఎందుకంటే పనుల్లో బహురకాలు. అందుకు పరిస్థితులు, వనరులు అనుకూలించాలి. అన్నీ అనుకూలించినా చేసేవారికి చిత్తశుద్ధి ఉండాలి. పైగా పనుల్లో రకాలు ఉన్నట్లే.. అవి చేసేవారిలోనూ డిఫరెంట్ మెంటాలిటీస్ కనిపిస్తుంటాయని నిపుణులు చెప్తున్నారు. అవేమిటి? ఎలాంటి ఫలితాలనిస్తాయో ఇప్పుడు చూద్దాం.
* సాధించాలన్న తపన (Achiever) : పనిలో అలసట, ఆనందం, ఫలితం అన్నీ ఉంటాయి. అందుకే కొందరు తమకు అవసరమైన పనిని తప్పక చేయాలనుకుంటారు. చదువులో, కెరీర్‌లో దీనిని అప్లై చేస్తే అచీవర్ల బెస్ట్ రిజల్ట్ చవిచూస్తారని నిపుణులు చెప్తున్నారు. పైగా ఇలాంటి వారు పనిని నిర్లక్ష్యం చేయరు. వర్క్ చేసేటప్పుడు ఫలితం ఆశిస్తారు. కానీ ఆ తర్వాత రాకపోయినా ఇబ్బంది పడరు. తమ పనేదో తాము చేసుకుపోయే ఈ రకం పని విధానం సక్సెస్‌కు దారితీస్తుందంటారు నిపుణులు.
*ఎక్స్‌పర్ట్స్ : నిపుణులంటే ఇక్కడ అన్నీ తెలిసిన వారు కాదు. తాము చేసే పనిపట్ల అవగాహన ఉన్నవారు. ఆ పనిలో లేదా సబ్జెక్ట్‌లో తగిన స్కిల్స్ ఉన్నవారు. ఇక్కడ అనుభవం, అవగాహన కీలకపాత్ర పోషిస్తాయి. ఈ రకమైన పనివిధానం కలిగి ఉండటంవల్ల మీరు నిపుణులుగా గుర్తించడతారు. పని పద్ధతుల్లో అనుభవం ఒక సంపదలాంటిది.
* టీమ్ వర్క్ : అవసరం ఉన్నప్పుడు ఒకలా, అవసరం తీరాక మరొకలా వ్యహరించడం, వర్క్‌ను బట్టి కాకుండా వ్యక్తుల చొరవను, రూపాన్ని, బ్యాగ్రౌండ్‌ను బట్టి అంచనా వేయడం, ఫలితాన్ని ఆశించడం నష్టం చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. దీనికి చక్కటి పరిష్కారం టీమ్ వర్క్. ఒక టీమ్ లీడర్‌గా ఉన్నవ్యక్తి తనకే అన్నీ తెలుసు అనే ధోరణితో కాకుండా విశాల దృక్పథాన్ని కలిగి ఉండాలి. మంచి ఎవరు చెప్పినా స్వీకరించాలి. అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకుంటూ, స్వీకరిస్తూ వెళ్లడం సక్సెస్‌కు దారితీస్తుంది.
*క్రియేటివిటీ : ఎంత చేశాం, ఎంత త్వరగా ముగించేశా అనేకది ముఖ్చమే అయినా అందులో నాణ్యత, సృజనాత్మకత అంతకంటే ముఖ్యం అంటున్నారు నిపుణులు. మీరు ఎప్పుడైతే కంఫర్ట్ జోన్‌లోనే ఉండాలనుకుంటారో అవన్నీ పోతాయి. కాబట్టి కాలాన్ని బట్టి మారాలి. అప్పటి పరిస్థితులను అన్వయించుకొని మీ పనిని కొనసాగించాలి. ఇలాంటి పని పద్ధతి తప్పక సక్సెస్ వైపు నడిపిస్తుందని అనుభవజ్ఞులు, నిపుణులు చెప్తుంటారు.