Chicken:చికెన్ తిన్నాక ఇవి తింటున్నారా? ప్రమాదంలో పడ్డట్లే..?

చికెన్ ప్రియుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Update: 2024-10-27 08:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: చికెన్(Chicken) ప్రియుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఆదివారం(Sunday) వస్తే చాలు అందరి ఇళ్లలో చికెన్ వాసన గుమగులాడాల్సిందే. కొంతమంది వారానికి ఒక్కసారి తింటే మరికొంతమంది వారానికి నాలుగైదు రోజులు తింటూ ఉంటారు. ముక్క లేనిది ముద్ద దిగదనుకోండి. అయితే పాలు చికెన్, మటన్(Mutton) లేదా చేపలు ఏదైనా నాన్ వెజ్(Non Veg) ఐటమ్ తిన్న తర్వాత పలు ఆహార పదార్థాలు తీసుకోకూడదని నిపుణులు చెబుతూనే ఉంటారు. పాలు తాగకూడదని,పెరుగు కూడా నాన్ వెజ్ ఫుడ్స్‌తో కలిపి తీసుకోకూడదని అంటుంటారు. అలాగే చికెన్, మటన్ ఎక్కువగా తింటే వేడి చేస్తుందని పెద్దలు చెబుతుంటారు. అయితే తాజాగా వారానికి ఒకట్రెండు సార్లు చికెన్ తింటే ఏం కాదు కానీ వారం మొత్తం తింటే మాత్రం ఆరోగ్యానికి ప్రమాదం అంటున్నారు నిపుణులు. అలాగే చికెన్ తిన్న తర్వాత ఈ ఫుడ్స్ అస్సలు తినకూడదని అంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

కూల్ డ్రింక్స్ తీసుకోకూడదు..

చికెన్ తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ కూల్ డ్రింక్స్(Cool drinks) తీసుకోకూడదు. అలాగే పండ్ల రసాలు తాగకూడదు. ఎందుకంటే చికెన్ తిన్న తర్వాత ఇవి తీసుకుంటే గ్యాస్ సమస్యలు(Gas problems) తలెత్తే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా జీర్ణక్రియ మందగిస్తుంది. టాక్సిన్స్(Toxins) కూడా రిలీజ్ అవుతాయంటున్నారు నిపుణులు.

బంగాళదుంపలు..

అలాగే చికెన్ తిన్నాక బంగాళదుంపలు(Potatoes) తినకూడదు. ఆలులో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. కాగా చికెన్ అండ్ బంగాళ దుంప కలిపి తింటే అజీర్తి ప్రాబ్లమ్స్(Indigestion problems) వస్తాయి. వాంతులు, వికారం వస్తుంది.

తేనె తీసుకోకూడదు..

తేనె జీర్ణమవ్వడానికి సమయం పడుతుంది కాబట్టి చికెన్ తిన్న తర్వాత తేనె(honey) అస్సలు తీసుకోకూడదు. కాగా ఈ రెండించి కాంబినేషన్ చాలా ప్రమాదకరం. ఈ రెండు కలిపి తీసుకోకపోవడమే బెటర్ అంటున్నారు నిపుణులు.

పెరుగు తినకూడదు..

చాలా మంది నాన్ వెజ్‌లో పెరుగు కలిపి తింటారు. కానీ పెరుగు(curd)తో కలిపి ఎట్టిపరిస్థితుల్లో తినకూడదు. దీంతో జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. బిర్యానీ(Biryani)లో కూడా పెరుగు కలుపుకుని తినవద్దు. అజీర్ణ సమస్యలు తలెత్తుతాయి.

పాలు తాగకూడదు..

ఎప్పుడైనా సరే చికెన్, మటన్ తిన్న తర్వాత పాలు(milk) తాగకూడదు. నాన్ వెజ్ తిన్నాక పాలు తాగితే చికెన్ జీర్ణం కావడానికి ఆలస్యం అవుతుంది. అలాగే శరీరంలో టాక్సిన్స్ ఏర్పడతాయి. జీర్ణప్రకియకు అడ్డుపడుతుంది. అంతేకాకుండా వికారం, పొత్తికడుపు(Abdomen)లో నొప్పి వస్తుంది. అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్, అల్సర్లు, మలబద్ధకం(Constipation, శరీరం చెడు వాసన, చర్మ సమస్యలు, కడుపు సంబంధిత సమస్యలు(Stomach related problems) తలెత్తే ప్రాబ్లమ్ ఉంది. కాగా చికెన్ తిన్న తర్వాత ఈ ఆహారాలు అస్సలు తీసుకోకూడదు.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు.కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Tags:    

Similar News