Bathe with cold water : వర్షాకాలం చల్లటి నీటితో స్నానం చేస్తే ఏం జరుగుతుంది?

అసలే వర్షాకాలం.. పైగా చల్లటి నీటితో స్నానం చేయడమా?.. జలుబు అవుతుంది కదా అంటుంటారు కొందరు. కాలమేదైనా చన్నీళ్ల స్నానమే ఆరోగ్యానికి మంచిదని ఇంకొందరు చెప్తుంటారు.

Update: 2024-08-31 10:42 GMT

దిశ, ఫీచర్స్ : అసలే వర్షాకాలం.. పైగా చల్లటి నీటితో స్నానం చేయడమా?.. జలుబు అవుతుంది కదా అంటుంటారు కొందరు. కాలమేదైనా చన్నీళ్ల స్నానమే ఆరోగ్యానికి మంచిదని ఇంకొందరు చెప్తుంటారు. ఇక తమ తమ ఆసక్తులు, నమ్మకాలను బట్టి కొందరు వేడినీళ్లతో చేస్తే.. మరి కొందరు చన్నీళ్లతో చేస్తుంటారు. అయితే ఏ నీళ్లతో చేస్తే మంచిది? వానాకాలం చల్లటి నీటితో చేయవచ్చా? నిపుణులు ఏం చెప్తున్నారో చూద్దాం.

* వాస్తవానికి స్నానం చేయడమనేది పరిశుభ్రతకు చాలా ముఖ్యం. తమ తమ ఆసక్తిని బట్టి వేడి లేదా చల్లటి నీటితో చేయవచ్చు. ఇక ప్రయోజనాల పరంగా చూస్తే ఈ రెండు రకాల పద్ధతులు కూడా సొంత ప్రయోజనాలు కలిగి ఉన్నాయంటున్నారు ఆయుర్వేదిక్ ఆరోగ్య నిపుణులు. అయితే వేడినీళ్లకంటే చల్లనీళ్లు మరింత ఎక్కువ ప్రయోజనాన్ని కలిగిస్తాయని చెప్తున్నారు.

* వేడి నీళ్లకంటే కూడా చల్లని నీటితో స్నానం చేసినప్పుడు శరీరం డిఫరెంట్‌గా రియాక్ట్ అవుతుంది. నీళ్లు పోయగానే చల్లగా అనిపించి.. వెంటనే అలర్ట్ అవుతుంది. రక్షణకోసం శరీరంలో వణుకు ప్రారంభం అవుతుంది. ఇది క్రమంగా శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఈ మొత్తం ప్రాసెస్ మన శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగు పరుస్తుందని నిపుణులు అంటున్నారు.

* చల్లటి వాటర్‌తో స్నానం చేయడంవల్ల స్కిన్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం తగ్గుతుంది. ఎందుకంటే అది పరోక్షంగా ఇమ్యూనిటీ పవర్ పెరిగేందుకు కారణం అవుతుంది. అలాగే చల్లటి నీరు శరీరంలో మంటను నివారిస్తుందని నిపుణులు చెప్తున్నారు. కార్టిసాల్ వంటి స్ట్రెస్ హర్మోన్ పెరిగినప్పుడు ఒత్తిడిగా ఫీలవుతుంటాం. అప్పుడు చల్లటి నీటితో స్నానం చేస్తే స్ట్రెస్ రిలీఫ్ అవుతుందని చెప్తారు.

* సీజన్లతో సంబంధం లేకుండా ఎప్పుడైనా చల్లటి నీటితో స్నానం చేయడం మంచిదే అంటున్నారు నిపుణులు. వర్షాకాలం కూడా పొద్దున్న కూల్ వాటర్‌తో స్నానం చేస్తే రోజంతా ఫ్రెష్‌గా, ఎనర్జిటిక్‌గా అనిపిస్తుందని, జీవక్రియ రేటు పెరుగుతుందని ఆయుర్వేదిక్ నిపుణులు చెప్తున్నారు. అయితే జ్వరం ఉన్నప్పుడు మాత్రం చల్లటినీటితో స్నానం చేయకపోవడం మంచిది. దీనివల్ల చలి ఎక్కువై ఆ సందర్భంలో రిస్క్ పెరుగుతుంది.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దీనిని ‘దిశ’ ధృవీకరించడం లేదు. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు. 


Similar News