జీవితంలో సానుకూల మార్పుల కోసం బ్రహ్మ ముహూర్తంలో చేయాల్సిన రెండు పనులివే?
మార్నింగ్ నిద్రలేవడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని తరచూ ఆరోగ్య నిపుణులు చెబుతూనే ఉంటారు.
దిశ, వెబ్‌డెస్క్: మార్నింగ్ నిద్రలేవడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని తరచూ ఆరోగ్య నిపుణులు చెబుతూనే ఉంటారు. డే మొత్తం యాక్టివ్‌గా ఉండటంతో పాటు అనేక ఆరోగ్య బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఉదయం ఎలాంటి కాలుష్యం ఉండదు. కాగా మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. అలాగే మరింత క్రమశిక్షణ కూడా అలవాటు అవుతోంది. మార్నింగ్ నిద్రలేస్తే ఎన్నో విజయాలు సాధించవచ్చు.
ఒక గంట టైమ్ కేటాయిస్తే
అయితే బ్రహ్మ ముహూర్తం సమయంలో రోజూ నిద్ర లేచి.. ఒక గంట టైమ్ కేటాయిస్తే మీ జీవితంలో ఎన్నో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. అందుకోసం తెల్లవారుజామునే ఈ రెండు పనులు చేస్తే మేలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
అత్యంత ప్రాధాన్యతనిచ్చే సమయమిదే..
తెల్లవారు జామున 3. 30 నిమిషాల నుంచి 5 లోపు సమయాన్నిబ్రహ్మ ముహూర్తం అంటారు. ఈ టైమ్ కు చాలా మంది అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ సమయానికి లేచిన వారు ఎక్కువ కాలం బతుకుతారని, సానుకూలమైన జీవితాన్ని పొందుతారని జ్యోతిష్య నిపుణులు చెబుతారు.
ప్రాణాయామం-బ్రిస్క్ నడక
అయితే సూర్యోదయానికి గంట ముందు మేల్కోని.. బ్రహ్మ ముహూర్తంలో చేయాల్సిన రెండు పనులు ఏంటో చూద్దాం.. ఉదయం నాలుగు గంటలకు లేచి.. దినచర్యలో 30 నిమిషాల ప్రాణాయామం, 30 నిమిషాల బ్రిస్క్ నడకను చేయండి. తెల్లవారు జామున ఎలాంటి కాలుష్యం ఉండదు కాబట్టి స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. ఫ్రెష్ ఆక్సిజన్ కూడా పొందవచ్చు.
ప్రయోజనాలు..
ఈ ప్రాణాయామంలో భ్రస్తిక, భ్రమరి, అనులోమ విలోమ, ప్రణవ ప్రాణాయామ పద్ధతులు ఫాలో అవ్వాలి. వీటి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. శరీర వ్యాధులను తొలగించడంలో ఎంతో మేలు చేస్తాయి. ఈ ప్రాణాయామాలు చేసే సమయంలో శ్వాసను తీసుకునేటప్పుడు ఓం అని మనసులో అనుకోండి. దీంతో ఒత్తిడి తగ్గుతుంది. ప్రతి రోజూ ఈ విధంగా చేసినట్లైతే మీ జీవితంలో సానుకూల మార్పులు రావడంతో పాటు శరీరానికి ఆక్సిజన్ అందిస్తుంది.
గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.