కొన్ని వస్తువులతో అలర్జీ ఎందుకు వస్తుంది.. కారణాలేంటో తెలుసా..

అలర్జీ అనే పదాన్ని మనం చాలాసార్లు వినే ఉంటాం. అంటే ఏదైనా ఒక వస్తువును వాడినప్పుడు, ఆహారాన్ని తిన్నప్పుడు అసౌకర్యంగా అనిపిస్తుంది.

Update: 2024-09-06 03:46 GMT

దిశ, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్ : అలర్జీ అనే పదాన్ని మనం చాలాసార్లు వినే ఉంటాం. అంటే ఏదైనా ఒక వస్తువును వాడినప్పుడు, ఆహారాన్ని తిన్నప్పుడు అసౌకర్యంగా అనిపిస్తుంది. తుమ్ములు, చర్మం పై ఎర్రటి దద్దుర్ల, ముఖం పై వాపులు వస్తుంటాయి. అలర్జీ ఏ వయసులోనైనా ఎవరికైనా రావచ్చు. కొన్నిసార్లు ఇది కాలక్రమేణా దానంతట అదే పోతుంది. మరికొన్ని సార్లు అదే అకస్మాత్తుగా పెరుగుతుంది. కొందరికి కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే అలర్జీ ఉంటే, మరికొందరికి కొన్ని వస్తువుల కారణంగా, వాతావరణం, జంతువుల ద్వారా అలెర్జీ ఉండవచ్చు.

ఒక వ్యక్తి కొన్ని వస్తువులను తాకినప్పుడు లేదా కొన్ని ఆహార పదార్థాలను తిన్న తర్వాత అలెర్జీ లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి. కొన్నిసార్లు ఈ లక్షణాలు వ్యక్తికి వెంటనే కనిపిస్తాయి. కొన్నిసార్లు లక్షణాలు కనిపించడానికి కొంత సమయం పడుతుంది.

అలెర్జీకి కారణాలు, లక్షణాలు..

అలర్జీ ఏర్పడేందుకు చాలా కారణాలున్నాయంటున్నారు వైద్యనిపుణులు. ఒక వ్యక్తి వివిధ రకాల అలెర్జీని కలిగి ఉంటాడు. ఒకరకమైన వైరస్ లేదా బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించినప్పుడు, రోగనిరోధక వ్యవస్థ దానిని గుర్తించి దాడి చేసినప్పుడు ఇలా జరుగుతుంది. ఈ సమయంలో తుమ్ములు, తేలికపాటి జ్వరం మొదలైన వివిధ ప్రతిచర్యలు శరీరంలో సంభవిస్తాయి.

అసలైన అలెర్జీ అనేది ఒక రకమైన హైపర్ సెన్సిటివిటీ డిజార్డర్ అంటారు. ఇది కొన్ని పదార్థాలను హానికరమైనదిగా పరిగణించడం ప్రారంభిస్తాయి. అవి తీసుకున్నప్పుడు వాటికి వ్యతిరేకంగా స్పందించడం ప్రారంభిస్తాయి. ఒక పదార్థానికి వ్యతిరేకంగా రక్షణ వ్యవస్థ ఇచ్చే ఈ ప్రతిచర్యను అలెర్జీ ప్రతిచర్యలు అని పిలుస్తారు. శరీరం ఈ ప్రతిచర్యను అందించిన పదార్థాలను అలెర్జీలు అంటారు.

అనేక రకాల అలర్జీలు..

డ్రగ్ అలెర్జీ..

కొన్ని రకాల మందుల వల్ల కలిగే అలర్జీని డ్రగ్ అలర్జీ అని అంటారు. ఇందులో వ్యక్తికి ఒక నిర్దిష్ట ఔషధానికి అలెర్జీ ఉండవచ్చు.

ఆహార అలెర్జీ

ఒక నిర్దిష్ట రకమైన ఆహారాన్ని తిన్న తర్వాత శరీరంలోని రక్షణ వ్యవస్థ ప్రతి స్పందించవచ్చు. ఇలా అయినప్పుడు ఇందులో వాంతులు, వికారం కలుగుతాయి. చాలా మందికి గోధుమలు లేదా అధిక ప్రొటీన్లు కలిగిన ఆహారాలు అలర్జీ కలిగిస్తాయి. ఇలా అయితే దాన్ని ఫుడ్ అలెర్జీ అంటారు.

వెదర్ అలెర్జీలు..

వెదర్ అలర్జీ అంటే వాతావరణంలో మార్పుల వల్ల ఎప్పుడూ ఇబ్బంది పడాల్సి వస్తుంది. దీనిని వాతావరణ అలెర్జీ అని కూడా అంటారు. ఒక నిర్దిష్ట వాతావరణంలో మార్పు వచ్చినప్పుడు చాలా మంది అసౌకర్యానికి గురవుతారు. దీనిని వాతావరణ అలెర్జీ అని పిలుస్తారు. ఇది పొగమంచు సమయం చలికాలంలో అసౌకర్యంగా అనిపించినప్పుడు కొంతమందిలో అలెర్జీ ఏర్పడుతుంది. అలాగే చాలా మంది చల్లని గది నుండి వేడిలోకి వచ్చిన వెంటనే తుమ్ములు ప్రారంభిస్తారు. ఇది కూడా వాతావరణ అలెర్జీ లక్షణం అంటున్నారు వైద్యనిపునులు.

కాంటాక్ట్ డెర్మటైటిస్ అలెర్జీ..

దీనిలో ఒక నిర్దిష్ట వస్తువును తాకడం వల్ల చర్మం పై ఎరుపు రంగు గుర్తులు కనిపించడం ప్రారంభిస్తాయి. ఏదైనా ప్రత్యేకమైన బట్టలు వేసుకున్న తర్వాత దురద లేదా ఎర్రటి దద్దుర్లు రావడాన్ని చాలా మందిలో చూసి ఉంటారు. దీనిని కాంటాక్ట్ డెర్మటైటిస్ అలెర్జీగా పరిగణించవచ్చు. అలాగే కొంతమందికి జంతువులకు తాకడం వలన కూడా అలెర్జీ వస్తుంటుంది.

డస్ట్ అలెర్జీ..

ఈ రోజుల్లో డస్ట్ అలర్జీ చాలా సాధారణంగా చెప్పవచ్చు. ఇది చాలా మందికి జరుగుతూనే ఉంటుంది. ఇందులోని దుమ్ములోని చిన్న కణాలు మీ ముక్కులోకి ప్రవేశించినప్పుడు, అది తుమ్ములు, దురద, ముక్కులో మంటను కలిగిస్తుంది.

స్కిన్ అలెర్జీ

చర్మం పై ఉపయోగించే అనేక కాస్మెటిక్ ఉత్పత్తులలో ఉండే రసాయనాల వల్ల చాలా మందికి అలెర్జీ ఉండవచ్చు. దీంతో చర్మం పై వాపు, ఎర్రటి దద్దుర్లు కనిపించడం ప్రారంభిస్తాయి. అందువల్ల అనేక ఉత్పత్తులను ఉపయోగించే ముందు చర్మం పై తేలికపాటి పరీక్ష చేయమని సలహా ఇస్తారు.

* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు.


Similar News