క్రౌంచాసనం (మూడో పద్ధతి) ఎలా చేయాలి?.. ప్రయోజనాలేంటి?

ఎలా చేయాలి? : మొదటగా బల్ల పరుపు నేలపై కూర్చుని, తర్వాత రెండు కాళ్లు ముందుకు చాచాలి.

Update: 2022-10-26 03:59 GMT

దిశ, ఫీచర్స్: ఎలా చేయాలి? : మొదటగా బల్ల పరుపు నేలపై కూర్చుని, తర్వాత రెండు కాళ్లు ముందుకు చాచాలి. ఇప్పుడు ఎడమకాలి మోకాలును మడిచి పాదాన్ని ఎడమ భుజం కింద భాగంలో సంకలో పెట్టాలి. ఇప్పుడు ఎడమచేతు, పిరుదులపై బాడీ బ్యాలెన్స్ సెట్ చేసుకోవాలి. తర్వాత కుడికాలు మోకాలిని మడిచి పాదాన్ని కుడి చేతితో పట్టుకుని నెమ్మదిగా పైకి లేపి నిటారుగా ఆకాశం వైపు లాగుతుండాలి. ఈ భంగిమలో పిరుదులు నేలపై, ఎడమ చేయి, కుడి కాలు నిటారుగా ఉండేలా చూసుకోవాలి. ఇలా సాధ్యమైనంతసేపు ఆగి మళ్లీ ఎడమకాలిని పైకి లేపి చేయాలి.

ప్రయోజనాలేంటి?

* కాళ్ల కండరాలను సాగదీసి బలోపేతం చేస్తుంది.

* జీర్ణక్రియ, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

* చీలమండలానికి బలాన్ని చేకూర్చడంలో సాయం.

* మలబద్ధకం సమస్యలను వదిలించేస్తుంది.

Tags:    

Similar News