weird Rituals: ప్రపంచంలోని వింత సంప్రదాయాలు.. వింటే బాబోయ్ ఏంటి ఇవి అని అనాల్సిందే..!

సాధారణంగా దేశం ఒక్కటే అయినప్పటికి ప్రాంతాన్ని బట్టి ఆచారాలు భిన్నంగా ఉంటాయి.

Update: 2024-08-26 06:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా దేశం ఒక్కటే అయినప్పటికి ప్రాంతాన్ని బట్టి ఆచారాలు భిన్నంగా ఉంటాయి. ఇక ప్రపంచంలో అయితే ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. భిన్న భిన్న సంప్రదాయాలతో వినడానికే విచిత్రంగా ఉంటాయి. అందులో స్పెషల్‌గా కొన్ని విన్నప్పుడు మాత్రం వామ్మో ఇవేమ్ సంప్రదాయాలు నాయనా అనిపిస్తుంది. ప్రస్తుతం అలాంటి ఆచారాలు ప్రపంచంలో చాలానే ఉన్నాయి. వాటిలో మనం కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1) లా టమాటినా:

వినడానికే విచిత్రంగా ఉన్న ఇది ఒక స్పానిష్ ఫెస్టివల్. ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగే ఫుడ్ ఫైట్‌లో పెద్దది. ఈ ఫెస్టివల్‌లో టమాటాలని విసురుకుంటారు. అయితే 1940 నుంచి కూడా ఈ ఫెస్టివల్‌ని జరుపుతున్నారు.

2) టొసింగ్ టీత్:

ఊడిపోయిన పళ్ళను గ్రీస్‌లో పిల్లలు విసిరి ఏదైనా కోరికను కోరుకుంటారు. ఇలా చేయడం వలన అదృష్టం కలిసి వస్తుందని, మనం కోరుకున్నవి నెరవేరుతాయని అక్కడ ప్రజలు బలంగా నమ్ముతారు.

3) ఉమ్మడం, అభినందనలు తెలపడం:

మామూలుగా ఉమ్మితే ఎవరైనా కోప్పడతారు. ఇక్కడ ఇక్కడ మాత్రం ఒకరి మీద ఉమ్మి వాళ్లకు ఆశీర్వాదాలు ఇస్తారు. పెళ్లి కూతురుకైనా అప్పుడే పుట్టిన పిల్లలకైనా కూడా ఇలా చేస్తారు. ఇది కెన్యా, టాంజానియా, ఆఫ్రికన్ గ్రేట్ లేక్స్ ప్రాంతాల్లో జరుగుతుంది.

4) చప్పుడు చేస్తూ తినడం:

సాధారణంగా అవతలి వాళ్లు తింటున్నప్పుడు సౌండ్ చేస్తే మనకు కోపం, చిరాకు వస్తుంది. కానీ, జపాన్లో మాత్రం చప్పుడు చేస్తూ తినడం ఒక సంప్రదాయం. అక్కడ ఎంత గట్టిగా శబ్దం చేసుకుంటూ తింటే అంత బాగా పొగుడుతారు.

5) కిస్సింగ్:

ఫ్రాన్స్‌లో కిస్సింగ్ ఒక పద్ధతి. ఫ్రెంచ్ వాళ్ళు ఎవరికైనా శుభాకాంక్షలు చెప్పాలంటే ముద్దులు పెట్టి శుభాకాంక్షలు తెలుపుతారు. అది తెలియని వ్యక్తులకు అయినా సరే.

6) భార్యను ఎత్తుకెళ్లడం:

ప్రతి ఏడాది ఫిన్లాండ్‌లో ఈ పోటీని జరుపుతారు. ఇందులో గెలిచిన వాళ్ళకు భార్య ఎంత బరువు ఉంటే అన్ని కేజీల బీర్ ఫ్రీగా ఇస్తారు.

7) దాల్చిన చెక్క:

డెన్మార్క్‌లో 25 ఏళ్ల వచ్చిన వ్యక్తికి కుటుంబ సభ్యులు స్నేహితులు వాళ్ళ మీదకి దాల్చిన చెక్కను విసురుతారు. ముందు వాళ్ల మీద నీళ్లు జల్లి ఆ తర్వాత వాళ్లను తల నుంచి పాదాల వరకు దాల్చిన చెక్కలో ఉంచుతారు. కాగా వారు వంద ఏళ్ల నుంచి ఈ పద్ధతిని పాటిస్తున్నారు.


Similar News