ఏలకులతో మెరిసే ముఖం.. ఎలాగో చూడండి..
భారతీయ వంటగదిలో అనేక రకాల మసాలాలను ఉపయోగిస్తాం.
దిశ, ఫీచర్స్ : భారతీయ వంటగదిలో అనేక రకాల మసాలాలను ఉపయోగిస్తాం. అయితే ఆహారం రుచిని పెంచే ఈ మసాలాలు మీ చర్మాన్ని అందంగా చేస్తాయట. అలాంటి ఓ మసాలా ఐటం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతిరోజూ దీన్ని ఉపయోగించడం ద్వారా సహజమైన మెరిసే చర్మాన్ని పొందవచ్చంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ సుగంధ ద్రవ్యం ఏంటి, ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు బిర్యానీ చేసినా లేదా ఏదైనా ప్రత్యేక వంటకం చేసినా ఏలకులను ఖచ్చితంగా వాడతారు. ఆహార రుచిని పెంచే ఈ మసాలాతో మీ ముఖ సౌందర్యాన్ని కూడా పెంచుకోవచ్చు. మరి ఆ మార్గాలను ఇప్పుడు చూద్దాం.
ఏలకులను ఇలా ఉపయోగించాలి..
మచ్చలేని మెరిసే చర్మాన్ని పొందడానికి మీరు ఈ మార్గాల్లో ఏలకులను ఉపయోగించవచ్చు. దీని కోసం కనీసం 5-10 ఏలకులను తీసుకోవాలి. వాటిని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఆ యాలకుల పొడిలో తేనె, పాలు కలిపి ఫేస్ మాస్క్‌ను సిద్ధం చేసుకోవచ్చు. ఈ పేస్ట్‌ని రోజూ ముఖానికి రాసుకోవాలి.
ఏలకులు, పెరుగు కలిపిన ఫేస్ ప్యాక్..
మీరు ఒక చెంచా యాలకుల పొడిని పెరుగుతో కలిపి హైడ్రేటింగ్ ఫేస్ మాస్క్‌ని తయారు చేసుకోవచ్చు. ఈ ఫేస్ మాస్క్‌తో మీ ముఖం పై మొటిమల గుర్తులను కూడా తగ్గించుకోవచ్చు. దీన్ని చేయడానికి, ఒక చెంచా యాలకుల పొడిని పెరుగుతో కలపండి. కావాలంటే ఇందులో శనగపిండి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పేస్ట్‌ని ముఖానికి అప్లై చేసి కనీసం 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఫేస్ ప్యాక్ ఆరిపోయిన తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో కడగాలి.
ఏలకుల నీటితో ఉపయోగాలు..
మీరు ఏలకుల నీటిని ఉపయోగించి మెరిసే చర్మాన్ని పొందవచ్చు. దీని కోసం, ఒక గ్లాసు నీటిలో 5-10 ఏలకులను ఉడకబెట్టండి. నీళ్లు బాగా మరిగిన తర్వాత ఏలకులు లేత రంగులోకి వచ్చాక ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. నీరు చల్లబడిన తర్వాత దానితో మీ ముఖాన్ని కడగాలి. అలాగే దానిని టోనర్‌గా కూడా ఉపయోగించవచ్చు. మెరిసే చర్మంతో పాటు, ఏలకులను ఉపయోగించడం ద్వారా నోటి దుర్వాసనను కూడా పోగొట్టుకోవచ్చు. మీరు ఈ ఏలకుల నీటిని రోజుకు రెండుసార్లు పుక్కిలించవచ్చు. దీంతో ఆహారం తిన్న తర్వాత నోటి దుర్వాసన పోతుంది. ఏలకుల అలెర్జీ ఉన్నవారు కొందరు ఉన్నారు. మీకు కూడా అలాంటి అలెర్జీ ఉంటే, ఏలకులను ఉపయోగించే ముందు ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి.
గమనిక : ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకున్నది. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.