అందరితో కలిసి మ్యాచ్ చూస్తే బ్రెయిన్ షార్ప్ అయిపోతుందట..

ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ ఫుల్ స్వింగ్ లో ఉండగా.. ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అంతా ఒకే చోట చేరి ఎంజాయ్ చేస్తున్నారు. అయితే జపాన్ కు

Update: 2024-06-09 11:42 GMT

దిశ, ఫీచర్స్: ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ ఫుల్ స్వింగ్ లో ఉండగా.. ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అంతా ఒకే చోట చేరి ఎంజాయ్ చేస్తున్నారు. అయితే జపాన్ కు చెందిన ఓ యూనివర్సిటీ చేసిన అధ్యయనం ఇలా అంతా కలిసి స్పోర్ట్స్ చూడటం వల్ల బ్రెయిన్ సూపర్ యాక్టివ్ అయిపోతుందని.. పూర్తిగా షేప్ మారిపోయి మెదడుపై దీర్ఘకాలిక సానుకూల ప్రభావం చూపుతుందని తెలిపింది. 20వేల మంది జపానీయులపై చేసిన అధ్యయనం.. స్పోర్ట్స్ వాచింగ్ తో

బ్రెయిన్ రివార్డింగ్ సర్క్యూట్స్ డైరెక్ట్ గా యాక్టివేట్ అయిపోతాయని గుర్తించింది.

బ్రెయిన్ ఇమేజింగ్ టెక్నిక్స్ వినియోగించి చేసిన ఈ స్టడీ.. ఫ్రెండ్స్, స్ట్రేంజర్స్ నెయిల్ బైటింగ్ మ్యాచ్ చూడటం వల్ల మెదడులోని రివార్డ్ ప్రాసెసింగ్ ప్రాంతాల్లో యాక్టివిటీ పెంచుతుందని తేలింది. ఈ పద్ధతి ఒంటరితనం, మానసిక రుగ్మతలను దూరం చేస్తుంది. కాగా ఈ అధ్యయనం సోషల్ రిలేషన్స్ గురించి ప్రత్యేకంగా చర్చిస్తుంది. క్రీడలు మన శ్రేయస్సుకు హెల్ప్ అవుతాయని.. మానసిక స్థితిని పెంచుతాయని నిరూపించింది.


Similar News