బరువు తగ్గించే మసాలా దినుసులు

లైఫ్ స్టైల్, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల బరువు పెరిగిపోవడం కామన్ అయిపోయింది. దీనివల్ల అనేక దీర్ఘకాలిక వ్యాధులు వెంటాడుతున్నాయి.

Update: 2024-10-25 17:48 GMT

దిశ, ఫీచర్స్ : లైఫ్ స్టైల్, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల బరువు పెరిగిపోవడం కామన్ అయిపోయింది. దీనివల్ల అనేక దీర్ఘకాలిక వ్యాధులు వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో మన వంటింటి మసాలా దినుసులు కొవ్వు తగ్గించేందుకు, బరువు నియంత్రణకు ఎలా సహాయపడుతాయో చెప్తున్నారు నిపుణులు.

  • రెడ్ మిర్చి... ఇందులో క్యాప్సైసిన్ వంటి సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి అంతర్గత కొవ్వును బర్న్ చేయడంలో సహాయపడతాయి. ఇది బరువు తగ్గించే విధానాన్ని మరింత పెంచుతుంది.
  • ఏలకులు... ఇలాచిలో మెలటోనిన్ తోపాటు ఉన్న ఇతర లక్షణాలు.. జీవక్రియ, జీర్ణక్రియను పెంచుతాయి. బెల్లీ ఫ్యాట్ కరిగించేలా చేస్తాయి.
  • నల్ల మిరియాలు.. ఇవి పైపెరిన్ కలిగి ఉంటాయి. ఇది జీవక్రియ, ఫ్యాట్ బర్న్ చేసే ప్రాసెస్ ప్రేరేపించడంలో హెల్ప్ అవుతుంది.
  • దాల్చిన చెక్క.. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. బరువు పెరిగే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
  • అల్లం.. అత్యంత సాధారణ మసాలా దినుసులలో ఒకటి. ఇది జీవక్రియను పెంచే థర్మోజెనిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. బరువు తగ్గడానికి, కొవ్వును కాల్చడానికి మరింత సహాయపడుతుంది.
  • జీలకర్ర..  ఇది కొవ్వు నిల్వలను తగ్గిస్తుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడానికి కేలరీలను బర్న్ చేయడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది.
Tags:    

Similar News