Blood Pressure: అధిక రక్తపోటు తగ్గించాలనుకుంటున్నారా.. అయితే ఈ డ్రింక్స్ ట్రై చేయండి!

మనలో చాలామంది అధిక రక్తపోటుతో బాధ పడుతున్నారు

Update: 2024-09-26 08:50 GMT

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం, మనలో చాలామంది అధిక రక్తపోటుతో బాధ పడుతున్నారు. దీని వలన అనేక సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఇది గుండె ఆరోగ్యానికి, మెదడు సమస్యలకూ దారితీస్తుంది. దీనిని తగ్గించడం కోసం వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం, డ్రింక్స్ తీసుకుంటూ ఉంటారు. రక్తపోటు అదుపులో పెట్టె పానీయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

పుదీనా రసం

పుదీనా మొక్కలో ఎన్నో ఔషధగుణాలు ఉంటాయి. ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. పుదీనా ఆకులను.. నీటిలో మరిగించి, వాటిని చల్లార్చి తాగాలి

జామకాయ రసం

జామకాయలో విటమిన్ C, ఫైబర్ వంటివి ఎక్కువగా ఉంటాయి. ఇది రక్తపోటును తగ్గిస్తుంది. జామకాయ రసాన్ని రోజూ తాగడం రక్తపోటును అదుపులో ఉంటుంది.

దాల్చిన చెక్క నీళ్లు

దాల్చిన చెక్క రక్తపోటును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రోజుకొకసారి దాల్చిన చెక్క పొడిని నీటిలో కలిపి తాగడం వలన రక్తపోటును నియంత్రించవచ్చు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Tags:    

Similar News