Vitamin deficiency : శరీరంలో ఈ విటమిన్ లోపిస్తే డేంజర్.. ఏం జరుగుతుందంటే..

మనం హెల్తీగా ఉండటంలో వివిధ విటమిన్లు కీ రోల్ పోషిస్తాయన్న సంగతి తెలిసిందే. ఉదాహరణకు ఏ విటమిన్ కంటి చూపునకు, సి విటమిన్ చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

Update: 2024-08-29 08:09 GMT

దిశ, ఫీచర్స్ : మనం హెల్తీగా ఉండటంలో వివిధ విటమిన్లు కీ రోల్ పోషిస్తాయన్న సంగతి తెలిసిందే. ఉదాహరణకు ఏ విటమిన్ కంటి చూపునకు, సి విటమిన్ చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇలాగే మిగతా విటమిన్లు ప్రభావితం చేస్తుంటాయి. అయితే ఇవి ఎక్కువైనా.. తక్కువైనా ఏదో ఆరోగ్యంపై ఎఫెక్ట్ చూపుతాయి. ముఖ్యంగా విటమిన్ బి3 లోపం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోయే అవకాశం ఉందని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. ఇక బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను సైలెంట్ కిల్లర్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది గుండె జబ్బులు సహా పలు రకాల వ్యాధులకు కారణం అవుతుంది.

బ్యాడ్ కొలెస్ట్రాల్ ప్రభావం

నిజానికి బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే తక్కువ సాంద్రత కలిగిన లిపో ప్రోటీన్‌గా వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇది శరీరంలో ఎక్కువైతే హాని కలిగిస్తుంది. ముఖ్యంగా ధమనుల్లో పేరుకుపోతే రక్త ప్రసరణకు ఆటంకం కలిగి పక్షవాతం, గుండె పోటు వంటివి రావచ్చు. కాగా నిశ్చల జీవన శైలి, తరచుగా జంక్ ఫుడ్స్ తీసుకునే అలవాటు కూడా విటమిన్ బి3 లోపానికి, చెడు కొలెస్ట్రాల్ పెరుగుదలకు దారితీస్తుందని నిపుణులు చెప్తున్నారు.

ఎందుకు పెరుగుతుంది?

మరో కారణం ఏంటంటే.. పూర్ స్లీప్, దీర్ఘకాలంపాటు తగ్గిన ఫిజికల్ యాక్టివిటీస్, మెంటల్ స్ట్రెస్, ధూమపానం వంటివి కూడా చెడు కొలెస్ట్రాల్ పెరుగుదలకు కారణం అవుతాయి. దీంతోపాటు నియాసిన్ అనే విటమిన్ బి3 లోపించడం వల్ల కూడా అది పేరుకుపోతుంది. ఎందుకంటే విటమిన్ బి3 లోపించినప్పుడు మన శరీరం గుడ్ కొలెస్ట్రాల్‌ను సరిగ్గా ప్రొడ్యూస్ చేయదు. అదే విటమిన్ బి3 లేదా నియాసిన్ కలిగి ఉన్నప్పుడు శరీరంలో తయారైన హెల్తీ ఎంజైమ్‌లను లివర్‌కు తీసుకెళ్లడంలో, అక్కడ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏర్పడకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. పైగా ఇది తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రోటీన్ కాబట్టి ట్రైగ్లిజరైడ్ల ఉత్పత్తిని తగ్గించడంలోనూ సహాయం చేయడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు చెప్తున్నారు.

గుడ్ కొలెస్ట్రాల్ పెరగాలంటే..

విటమిన్ బి3 ఆహారాలను తినడంవల్ల శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుందని, ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను నిరోధిస్తుందని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. పైగా ఇది ధమనులకు అదనపు పొరలా పనిచేస్తూ బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగకుండా రక్షణగా నిలుస్తుంది. కాబట్టి విటమిన్ బి3 లభించే ఆహారాలను తింటూ ఉండాలి. ముఖ్యంగా అరటిపండ్లు, చికెన్, ట్యూనా చేపలు, పుట్ట గొడుగులు, బ్రౌన్ రైస్, వేరు శనగ, తృణ ధాన్యాలను ఆహారంలో భాగంగా తీసుకోవడం ద్వారా ఇది లభిస్తుంది. దీంతోపాటు తరచుగా వ్యాయామాలు చేయడం, జంక్ ఫుడ్స్‌కు దూరంగా ఉండటం వంటి జీవన శైలిని అలవర్చుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

*గమనిక:పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.  


Similar News