Viral Video: వెయిటర్ జాబ్ కోసం వేలాది మంది.. రెస్టారెంట్ ముందు క్యూ కట్టిన విద్యార్థులు !

Viral Video : వెయిటర్ జాబ్ కోసం వేలాది మంది.. రెస్టారెంట్ ముందు క్యూ కట్టిన విద్యార్థులు !

Update: 2024-10-07 06:35 GMT

దిశ, ఫీచర్స్: మనకు తెలిసిన స్టూడెంట్స్, గ్రాడ్యుయేట్స్ ఎవరైనా ఉన్నత చదువులకోసం, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్తున్నారని తెలిస్తే సంబరడిపోతుంటాం. ‘వావ్ గ్రేట్..’ అనేసి మెచ్చుకుంటాం. అక్కడ వారు హాయిగా చదువుకుంటారని, ఉద్యోగాలు చేస్తూ ఫుల్లుగా సంపాదిస్తారని భావిస్తాం. అయితే అందరికీ అదే పరిస్థితి వర్తించకపోవచ్చు అంటున్నారు విదేశీ వ్యవహారాలు తెలిసిన నిపుణులు. చాలా మంది ఇండియన్ యువతీ యువకులు, విద్యార్థులు విదేశాల్లో అష్టకష్టాలు పడుతుంటారని చెప్తుంటారు. అలాంటి దృశ్యాన్ని కళ్లకు కట్టే వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇండియన్ యూత్ అక్కడ పడే బాధలేమిటో వెల్లడిస్తోంది.

వైరల్ వీడియో ఇన్ఫర్మేషన్ ప్రకారం.. అది కెనడాలోని బ్రాంప్టన్ సిటీ. ఇక్కడ కొత్తగా ప్రారంభించిన ‘తందూరి ఫ్లేమ్’ రెస్టారెంట్ యాజమాన్యం వెయిటర్స్, సర్వర్స్ కావాలని ఓ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అది చూసిన పలువురు నిరుద్యోగులు వేల సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. రెస్టారెంట్ ముందు క్యూలో నిల్చున్నారు. కాగా అందులో మూడువేల మంది వరకు ఉద్యోగార్థులు వెయిట్ చేస్తుండగా వారిలో భారతీయులే అత్యధిక మంది ఉన్నట్లు ‘మేఘ్ అప్ డేట్’అనే ఎక్స్(ట్విట్టర్) యూజర్ పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా పోస్ట్ చేయగా.. తెగ వైరల్ అవుతోంది.

వెయిటర్ జాబ్ కోసం క్యూలో నిల్చున్న పరిస్థితి చూస్తుంటే.. విదేశాల్లోనూ నిరుద్యోగ సమస్య చాలా ఉందనిపిస్తోందంటూ పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అందుకు కెనడా మినహాయింపు కాదని కామెంట్ చేస్తున్నారు. అందుకే విదేశాలకు వెళ్లే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని సలహా ఇస్తున్నారు. ఏదో సాధించాలని, ఎన్నో ఆశలతో మన ఇండియన్ యూత్ విదేశాలకు వెళ్తోంది. అక్కడ తమ చదువులు కొనసాగించేందుకు చాలా మంది పార్ట్ టైమ్ జాబ్స్‌పై ఆధారపడుతుంటారు. కానీ ఈ మధ్య కాలంలో అక్కడ కూడా ఉద్యోగాల తొలగింపులు, సంక్షోభాలు, లే ఆఫ్‌లు కామన్ అయిపోయాయని పలువురు పేర్కొంటున్నారు. కెనడాలో వెయిటర్ జాబ్ కోసం మన విద్యార్థులు పడిగాపులు కాస్తున్న వీడియోనే అందుకు నిదర్శనమని కూడా కొందరు కామెంట్లు చేస్తున్నారు. 

Video Credits To Megh Updates On X


Similar News