Viral Video : ఆ చిన్నారిని చూసి డాల్ఫిన్ ఫిదా.. ఆ తర్వాత ఏం చేసిందో చూడండి!

సముద్రాల్లో, నదుల్లో, అక్వేరియంలలో డాల్ఫిన్స్‌ను చూసినప్పుడు ఎవరికైనా ముచ్చటేస్తుంది. అదే సందర్భంలో అవి నీటిలో చేసే విన్యాసాలు చూస్తే కొందరు భయపడుతుంటారు కూడా.

Update: 2024-08-29 12:42 GMT

దిశ, ఫీచర్స్ : సముద్రాల్లో, నదుల్లో, అక్వేరియంలలో  డాల్ఫిన్స్‌ను చూసినప్పుడు ఎవరికైనా ముచ్చటేస్తుంది. అదే సందర్భంలో అవి నీటిలో చేసే విన్యాసాలు చూస్తే కొందరు భయపడుతుంటారు కూడా. ఎందుకంటే మనుషులు కనిపించగానే అవి అలర్ట్ అవుతాయి. తమకు ఏదైనా హాని కలుగుతుందేమోనని భయపడి నీటిలో అటూ ఇటూ తిరుగుతూ.. శబ్దాలు చేస్తూ విన్యాసాలు చేస్తుంటాయి. కానీ ఒక చోట మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. తనను చూసేందుకు వచ్చిన ఓ చిన్నారిని చూసిన డాల్ఫిన్ తన బెస్ట్ ఫ్రెండ్ వచ్చినంత ఆనందగా వ్యవహరించింది. ప్రజెంట్ ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

వైరల్ వీడియో ఇన్ఫర్మేషన్ ప్రకారం.. ఒక చిన్న పాప అక్వేరియంలోని నీటికి సమీపంలోకి రాగానే ఆమెను చూసిన ఓ డాల్ఫిన్‌ను ఎంతో ఆత్రుతగా.. చాలా రోజులకు తన ఫ్రెండ్ వచ్చిందన్న ఫీలింగ్‌తో ఆమె దగ్గరకు వచ్చింది. ఆ చిన్నారి కూడా అంతే సంతోషంతో దానికి హాయ్ చెప్పింది. ఈ సందర్భంగా డాల్ఫిన్ కూడా నోరు తెరిచి పాపతో ఏదో మాట్లాడుతున్నట్లు ఫోజు పెట్టింది. ఆ సన్నివేశం చూస్తుంటే.. ఆ చిన్నారి, డాల్ఫిన్ క్లోజ్ ఫ్రెండ్స్ లాగా, ఏదో మాట్లాడుకుంటున్నారని అనిపించేలా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుండగా.. వాళ్లిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారని, డాల్ఫిన్‌కు చిన్నారి తెగ నచ్చిందని పలువురు స్పందిస్తున్నారు. 

Video Credits To Trending american Insta Id


Similar News