Viral Video : దోమల్ని చంపే ‘ఐరన్ డోమ్’ వచ్చేసింది.. వైరలవుతోన్న ఆనంద్ మహీంద్ర ట్వీట్

అసలే రెయినీ సీజన్. దోమకాటు వల్ల డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఈ సందర్భంలోనే ఎక్కువ.

Update: 2024-08-24 13:22 GMT

దిశ, ఫీచర్స్ : అసలే రెయినీ సీజన్. దోమకాటు వల్ల డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఈ సందర్భంలోనే ఎక్కువ. ఇప్పటికే దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రజలు దోమకాటు వల్ల వచ్చే విష జ్వరాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు నిపుణులు చెప్తున్నారు. అదే సందర్భంలో దోమల నియంత్రణపై అధికారులు, నిపుణులు కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సరిగ్గా ఈ నేపథ్యంలోనే ప్రముఖ బిజినెస్ మెన్ ఆనంద్ మహీంద్ర దోమల నియంత్రణ పరికరం వచ్చిందంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది.

వైరల్ సమాచారం ప్రకారం.. ‘దోమల్ని చంపే ఐరన్ డ్రోమ్’ వచ్చిందంటూ ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్ర తన ఎక్స్ వేదికగా ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఇందులోని పరికరాన్ని పరిశీలిస్తే గనుక ఓ మెషిన్ అటూ ఇటూ కదులుతూ ఉండగా.. దాని నుంచి లేజర్ కిరణాలు వెలువడుతున్నాయి. అందులో దోమల్ని చంపే మినియేచర్ క్యానస్ కూడా కనిపిస్తోంది. మొత్తానికి అదొక చిన్న సైజు యాంటీ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ మాదిరి రాడార్ వ్యవస్థను అమర్చబడి ఉంది.పైగా చుట్టు పక్కల గాలిలో ఎగురుతున్న దోమలను గుర్తించి చంపేయడం కూడా వీడియోలో గమనించవచ్చు. ప్రజెంట్ ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. నెటిజన్లు క్యూరియాసిటీతో కామెంట్లు పెడుతున్నారు.

Tags:    

Similar News