ఆశ్చర్యం కలిగించే 'రైన్ రోలింగ్'.. ఈ వీడియో నిజంగా వ్వావ్..!
అసాధారణంగా కనిపించడమే కాదు ఆనందాన్ని అందిస్తుంది. Internet Shows The Rain Rolling In Is The Most Satisfying Thing.
దిశ, వెబ్‌డెస్క్ః ఉండటానికి ఇల్లు లేనివాళ్లు కూడా వర్షం కురుస్తుంటే, దాన్ని చూస్తూ సంభ్రమాశ్చర్యాలు లోనవుతుంటారు. అది మనిషికి ప్రకృతితో ఉన్న అవినావభావ సంబంధం. వానల్లో ఎన్ని రకాలు ఉన్న రైన్ రోలింగ్ సీన్ మాత్రం అద్బుతంగా అనిపిస్తుంది. ఎందుకంటే అది ఒక పెద్ద అలలా మీ వైపుకు చేరుకుంటుంటే ఆ అనుభూతి వర్ణనాతీతంగా కనిపిస్తుంది. సరిగ్గా ఇలాంటి అనుభూతే ఎస్టోనియాలోని ఒక మత్స్యకారుడు పొందాడు. అతడు పడవపై కూర్చొని, దినచర్యలో భాగంగా చేపలు పడుతుంటే, అకస్మాత్తుగా తుఫాను వేగంగా వర్షం వచ్చింది. అయితే, అది తానున్న చోటుకి దూరంగా పడుతూ, క్రమంగా తన దగ్గరికి చేరింది. అయితే, అనుకోకుండా ఈ ఘటనను అతడు కెమెరాలో బంధించాడు. వైరల్ హాగ్ నుండి షేర్ చేసిన ఈ వీడియోలో ప్రతి వర్షపు బిందువు జాలరి దగ్గరకు చేరుకుంటున్న తీరు కనుల విందు చేస్తుంది. ఈ చిన్న క్లిప్ అసాధారణంగా కనిపించడమే కాదు, ఆనందాన్ని కూడా అందిస్తుంది.