Viral: అక్కడ కోక్‌ని మంచి నీళ్లలా తాగేస్తున్న జనం.. కారణం ఏమిటంటే..

బాగా దాహం వేస్తే ఎవరైనా ముందుగా నీళ్లు తాగుతారు. ఒకవేళ ఎండలో తిరిగి వచ్చినప్పుడు తక్షణ ఉపశనం కోసం, చల్లదనం కోసం కొందరు కూల్ డ్రింక్స్ కూడా తాగుతుంటారు. కానీ..

Update: 2024-08-25 06:48 GMT

దిశ, ఫీచర్స్ : బాగా దాహం వేస్తే ఎవరైనా ముందుగా నీళ్లు తాగుతారు. ఒకవేళ ఎండలో తిరిగి వచ్చినప్పుడు తక్షణ ఉపశనం కోసం, చల్లదనం కోసం కొందరు కూల్ డ్రింక్స్ కూడా తాగుతుంటారు. కానీ అక్కడి జనాలు మాత్రం నీళ్లకంటే ముందుగా కోక్ లేదా కోకా కోలా తాగుతుంటారు?. ఇదీ మెక్సికోలోని చియాపాస్ రాష్ట్రంలోని ఓ ప్రాంత ప్రజల డైలీ హాబిట్స్. ఎందుకలా చేస్తారు? నిపుణులు ఏం చెప్తున్నారో ఇప్పుడు చూద్దాం.

నిజానికి చియాపాస్‌లోని ఎత్తైన పర్వత ప్రాంతమైన శాన్ క్రిస్టోబల్ డి లాస్ కాసాస్ అనే ప్రాంతంలో తరచుగా నీటి కొరత ఉంటుందట. ఒకవేళ నీరు దొరికినప్పటికీ అది ఎక్కువగా స్వచ్ఛమైనది కాదని టూరిస్టు నిపుణులు చెప్తున్నారు. ఇక మరికొన్ని ప్రాంతాల్లో అయితే వారానికో, నెలకో ఒకసారి తాగు నీరు వస్తుందని, దీంతో రోజువారి అవసరాలు తీర్చుకునేందుకు ప్రజలు నీళ్ల ట్యాంకర్లను కొనుగోలు చేస్తుంటారని పర్యాటక నిపుణులు పేర్కొంటున్నారు.

ఇక తాగు నీటి విషయంలోనూ డబ్బులు వెచ్చించాల్సిందే. అయితే  డ్రింకింగ్ వాటర్‌, అలాగే రుచి కరమైన కోక్ వంటి పానీయాలు కూడా దాదాపు ఓకే రేంజ్‌లో తక్కువ ధరకు లభిస్తుంటాయి. దీంతో చియాపాస్‌ రాష్ట్రంలోని పర్వత ప్రాంత  ప్రజలు వాటర్ బాటిల్ కొన్నంత ఈజీగా కోక్ బాటిల్ కొనేసి తాగుతుంటారు. ఈ అలవాటు క్రమంగా వారిలో ఎక్కువ కోక్ వినియోగానికి దారితీసిందని నివేదికలు పేర్కొంటున్నాయి. సగటున చియాపాస్‌లోని ఒక వ్యక్తి ప్రతీ ఏడాది సుమారు 821 లీటర్ల కోక్ లేదా కోకా కోలా తాగుతారట. దాదాపు 50 ఏండ్ల నుంచి ఇక్కడి ప్రజల్లో ఇదొక అడిక్షన్‌గా మారిందని, ప్రతి వ్యక్తి డైలీ 2 నుంచి 2.5 లీటర్ల వరకు కోక్ లేదా కోకా కోలా తాగుతుంటారని టూరిస్ట్ గైడ్ నిపుణులు పేర్కొంటున్నారు.


Similar News