viral : భార్యా భర్తలు కానవసరం లేదు.. లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్నవారికే అద్దె ఇల్లు!

ఒకప్పుడు అద్దెకు ఇల్లు తీసుకోవడం చాలా ఈజీగా ఉండేది. రెంట్ పే చేసే ఆర్థిక స్థోమత ఉండి, టైమ్‌కు చెల్లిస్తే చాలు. మ్యారీడా, సింగిలా అని చూడకుండా ఎవరికైనా ఇల్లు దొరికేది. కానీ ప్రస్తుతం అలా కాదు.

Update: 2024-06-20 15:03 GMT

దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు అద్దెకు ఇల్లు తీసుకోవడం చాలా ఈజీగా ఉండేది. రెంట్ పే చేసే ఆర్థిక స్థోమత ఉండి, టైమ్‌కు చెల్లిస్తే చాలు. మ్యారీడా, సింగిలా అని చూడకుండా ఎవరికైనా ఇల్లు దొరికేది. కానీ ప్రస్తుతం అలా కాదు. ఓ రూమ్ రెంటుకు తీసుకోవాలంటే చాలా కష్టపడాలి. ఇంటి ఓనర్లు రకరకాల కండిషన్లు పెడుతుంటారు. ఇక బ్యాచిలర్స్‌కు, పెళ్లి కాని జంటలకు అయితే ఇల్లు అద్దెకు అస్సలు ఇవ్వరు. కొందరు ఓనర్లకైతే కుల పిచ్చి, మత పిచ్చి, వాస్తు పిచ్చి కూడా ఉంటాయి. మరి కొందరైతే ఇల్లు అద్దెకిస్తారా అని అడగగానే ఏదో ముఖ్యమైన ఉద్యోగానికి చేసినట్లు పెద్ద ఇంటర్వ్యూనే చేసేస్తారు. సర్టిఫికెట్లు, ఫామ్ -16 కూడా అడిగేవారు చాలామందే ఉంటున్నారు.

కొందరు ఇంటి ఓనర్ల ఛాందస్తంవల్ల వివిధ ప్రాంతాల నుంచి నగరాలకు వచ్చి అద్దెకు ఉండటం బ్యాచిలర్లకు, పెళ్లికాకుండానే సహజీవనం చేసే జంటలకు చాలా కష్టమైపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఎవరూ అద్దెకు ఇవ్వరు. కానీ ప్రముఖ వ్యాపార వేత్త, వూష్ కంపెనీ ఫౌండర్ ప్రియమ్ సరస్వత్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచించాడు. బెంగుళూరులోని హెచ్ఎస్ఆర్‌ లే అవుట్ దగ్గరలో పెద్ద బంగ్లాను కొనుగోలు చేసిన ఇతను, తన ఇంటిలో సింగిల్, డబుల్ బెడ్ రూములను కేవలం బ్యాచిలర్స్, అలాగే సహజీవనం చేస్తున్న జంటలకు మాత్రమే ఇస్తానని అనౌన్స్ చేశాడు. ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ‘నువ్వు గ్రేట్ బాస్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్.


Similar News