బ్ర‌హ్మ‌జెముడుతో లిప్‌స్టిక్‌, వాడేసిన సిరంజీల్లో వింత‌గా త‌యారీ! (వీడియో)

కొంతమంది నవ్వితే, మరికొందరు తిక‌మ‌కప‌డి త‌ల గోక్కున్నారు! Man making lipstick with used syringes, cacti and oil.

Update: 2022-07-15 13:13 GMT

దిశ, వెబ్‌డెస్క్ః మీరు సోషల్ మీడియాలో యాక్టీవ్ యూజ‌ర్‌లు అయితే ఇంటర్నెట్‌లో ఎన్నో విచిత్రమైన విష‌యాల‌ను చూసుంటారు. ఆన్‌లైన్‌లో పిచ్చిగా వైరల్ అయిన ఈ వీడియోలో కూడా ఇలాంటి ఒక కంటెంట్ ఆస‌క్తిని రేకిత్తిస్తుంది. వాడేసిన‌ సిరంజిలు, బ్ర‌హ్మ‌జెముడు ఆకులు, నూనెతో ఓ వ్య‌క్తి ఎరుపు రంగు లిప్‌స్టిక్‌లను తయారు చేస్తాడు. అయితే, దాని త‌యారీ అంతా నెటిజ‌నుల‌ను ఆశ్చర్యపరుస్తుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోను స్క్రీమర్ జిమ్ అనే పేజీ ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. ఇందులో లిప్‌స్టిక్‌ను తయారు చేయడానికి, మనిషి వాడేసిన‌ సిరంజిలను వేడి నీళ్ల‌లో శుద్ధి చేసి, సూదులను కత్తిరిస్తాడు. త‌ర్వాత బ్ర‌హ్మ‌జెముడు ఆకుల్నిఎండబెట్టి, దాని నుండి తీసిన మైనాన‌ని ఎరుపు రంగుగా మారుస్తాడు. దాన్ని కొంచెం నూనె, నీళ్లతో మరిగించి, సిరంజీల్లో నింపుతాడు. క్లిప్ చివ‌ర్లో దాన్ని పెదాల‌కు రాసుకుంటాడు. "100 సంవత్సరాల్లో ఇది ఎక్కడికి వెళుతుందో మీరు ఊహించలేరు" అని పోస్ట్ క్యాప్ష‌న్‌ చెబుతుంటే, ఇంట‌ర్నెట్‌లో 6 మిలియన్లకు పైగా వ్యూవ్స్‌ పొందింది. కొంతమంది దీన్ని చూసి నవ్వితే, మరికొందరు తిక‌మ‌కప‌డి త‌ల గోక్కున్నారు. మీరేమంటారు..?!


Similar News