మెట్రో రైల్లో అబ్బాయిని కుమ్మిన అమ్మాయి.. ఎందుకో తెలిస్తే షాకే!! (వీడియో)

ఒక్క‌సారి కాదు, ఛెళ్లు, ఛెళ్లు.. అలా కొట్టింది. Boy and girl fighting in Delhi metro on T-Shirt price.

Update: 2022-07-14 12:59 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః కొన్ని సంద‌ర్భాలు ఎందుకు జ‌రిగుతాయో ఎవ్వ‌రికీ అర్థంకాదు. అలాంటి, ఓ ఫ‌న్నీ ఇన్సిడెంట్ ఢిల్లీ మెట్రోలో చోటుచేసుకుంది. ఓ అబ్బాయి, అమ్మాయి మధ్య వాగ్వాదానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ అమ్మాయి అబ్బాయిని చెంపదెబ్బ కొట్టడంతో వివాదం వేడి తెలుస్తుంది. అయితే, ఇది ఇతర ప్రయాణికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎందుకంటే, అస‌లు అక్క‌డ ఏ అంశంలో వాళ్లు గొడ‌వ ప‌డుతున్నారో తెలిస్తే మీరూ షాక‌వుతారు. ఈ వీడియోలో, అబ్బాయి, అమ్మాయి ఒక టీష‌ర్ట్ ధర గురించి వాదించుకుంటారు. జరా నుండి రూ. 1000 లకు T- షర్టు కొన్న‌ట్లు అమ్మాయి చెబుతుంది. కాని ఈ అబ్బాయి, దాన్ని ఒప్పుకోక‌పోగా, యే.. అది రూ. 150 కంటే ఎక్కువ ఉండదని అంటాడు. ఇక చూడండి.. కోపంతో పెట్రేగిపోయిన ఆ అమ్మాయి అబ్బాయిని చెంప ఛెళ్లుమ‌నిపిస్తుంది. ఒక్క‌సారి కాదు, ఛెళ్లు, ఛెళ్లు.. అలా కొట్టింది.

ఇక అబ్బాయి వార్నింగ్ ఇచ్చి, అది పబ్లిక్ ప్లేస్ అని హెచ్చరిస్తాడు. అయినా కూడా ఆ అమ్మాయి చేయి ఎత్తడానికి ఏ మాత్రం వెనుకాడదు. కాసేపటి తర్వాత, అబ్బాయి కూడా అమ్మాయిని చెంపదెబ్బ కొడ‌తాడు. ఇలా సాగిన కొట్లాట‌లో చివ‌రికి ఆ అమ్మాయి ఆగు, మా అమ్మ‌తో చెబుతానంటూ రైలు దిగుతుంది. వెంట‌నే అబ్బాయి కూడా ఆమెను అనుస‌రిస్తాడు. ఇది ప్రాంక్‌ వీడియోనా లేక నిజంగానే వీరిద్దరూ గొడవ పడ్డారా అనేది ఇప్పటి వరకు తెలియరాలేదు. కానీ, ఈ షాకింగ్ వీడియోను మందార్ ట్విట్టర్‌లో పంచుకోగా, నెటిజ‌నులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. 


Similar News